PSL 2025 : హెయిర్‌ డ్రైయర్‌, ట్రిమ్మ‌ర్ కాదురా అయ్యా.. ష‌హీన్ అఫ్రిదికి ఖ‌రీదైన గిఫ్ట్‌..

హోర్ ఖలంద‌ర్స్ యాజ‌మాన్యం త‌మ జ‌ట్టు కెప్టెన్ కు అదిరిపోయే బ‌హుమ‌తి ఇచ్చింది.

PSL 2025 : హెయిర్‌ డ్రైయర్‌, ట్రిమ్మ‌ర్ కాదురా అయ్యా.. ష‌హీన్ అఫ్రిదికి ఖ‌రీదైన గిఫ్ట్‌..

Shaheen Afridi lahore receives a 24k gold plated iphone 16 pro from qalandars

Updated On : April 22, 2025 / 12:55 PM IST

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ 2025లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన ఆట‌గాళ్ల‌కు బ‌హుమ‌తిగా క‌రాచీ కింగ్స్ యాజ‌మాన్యం హెయిర్ డ్ర‌య‌ర్లు, ట్రిమ్మ‌ర్లు వంటి వాటిని అంద‌జేయ‌డంతో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అంత‌ర్జాతీయ స్టాయి ఆట‌గాళ్ల‌కు క‌నీస విలువ చేసే బ‌హుమ‌తులు ఇవ్వ‌లేరా? ఇంత‌కంటే గ‌ల్లీ క్రికెట్‌లోనే మంచి బ‌హుమ‌తులు ఇస్తారని మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌రో ఫ్రాంచైజీ లాహోర్ ఖలంద‌ర్స్ యాజ‌మాన్యం త‌మ జ‌ట్టు కెప్టెన్ కు అదిరిపోయే బ‌హుమ‌తి ఇచ్చింది.

కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి ఐఫోన్ బ‌హుమ‌తిగా ఇచ్చింది. అది మామూలు ఐఫోన్ కాదండోయ్.. బంగారు పూత పూసిన‌ ఐఫోన్ 16 ప్రో కావ‌డం విశేషం. ఈస్ట‌ర్ సంద‌ర్భంగా లాహోర్ ప్లేయ‌ర్స్‌తో పాటు స‌హాయ‌బృందానికి కొన్ని బ‌హుమ‌తుల‌ను అంద‌జేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను త‌మ సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది.

Jwala Gutta-Vishnu Vishal : పెళ్లి రోజునే పండంటి పాపకు జన్మనిచ్చిన బ్యాడ్మింటన్ స్టార్‌..


‘మా సార‌థికి విలువైన బ‌హుమ‌తి. అత‌డి కోస‌మే దీన్ని ప్ర‌త్యేకంగా త‌యారు చేయించాం.’ అని రాసుకొచ్చింది. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

ఇక ఈ వీడియోలో ఆ జ‌ట్టు మ‌రో ఆట‌గాడు హ‌రీస్ ర‌వూఫ్ మాత్రం అత‌డికొక్క‌డికే ఐఫోన్ ఇవ్వ‌డం అన్యాయం అన‌డం వినిపించింది.

SRH vs MI : ఉప్పల్‌లో ముంబైతో స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్.. ఓడిపోయినా హైద‌రాబాద్ ప్లే ఆఫ్స్ చేరుకునే ఛాన్స్‌..!

ఈ సీజ‌న్‌లో ష‌హీన్ అఫ్రీది సార‌థ్యంలోని లాహోర్ ఖ‌లంద‌ర్స్ దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు మూడు మ్యాచ్‌లు ఆడ‌గా రెండు మ్యాచ్‌లో విజ‌యాల‌ను సాధించింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో నిలిచింది.