IPL 2025 PBKS vs KKR preview head to head pitch report
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చంఢీగడ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. గత మ్యాచ్‌లో 245 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికి 8 వికెట్లతో పంజాబ్ ఓడిపోయింది. ఈ క్రమంలో కేకేఆర్‌తో జరగనున్న మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని పంజాబ్ భావిస్తోంది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్‌రేట్ +0.065గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ విజయాల బాట పట్టింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోగా మరో మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆరు పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్+0.803గా ఉంది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
హెడ్ టు హెడ్..
ఐపీఎల్‌లో ఇరు జట్లు 33 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 21 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించగా, 12 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలిచింది.
పిచ్ రిపోర్ట్..
చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లో ఉన్న మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. భారీ స్కోర్లు నమోదు అవుతుంటాయి. రెండు జట్లలో కూడా బిగ్ హిట్టర్లు ఉండడంతో ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం ఉండకపోవచ్చు.
LSG vs CSK : చెన్నై చేతిలో ఎందుకు ఓడిపోయామంటే.. పంత్ కామెంట్స్ వైరల్.. బిష్ణోయ్ చేత ఆఖరి ఓవర్
తుది జట్ట అంచనా..
పంజాబ్ కింగ్స్..
ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ ప్లేయర్ : యష్ ఠాకూర్
కోల్‌కతా నైట్ రైడర్స్..
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్ : అంగ్క్రిష్ రఘువంశీ