SRH : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌ల‌ తర్వాత మ‌రో డేంజ‌ర‌స్ బ్యాట‌ర్‌ను జ‌ట్టులో చేర్చుకున్న స‌న్‌రైజ‌ర్స్‌.. ఎవ‌రీ స్మరన్ రవిచంద్రన్?

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు షాక్ త‌గిలింది. గాయంతో స్టార్ ఆట‌గాడు ఆడ‌మ్ ఈ సీజ‌న్‌లోని మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు.

SRH : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌ల‌ తర్వాత మ‌రో డేంజ‌ర‌స్ బ్యాట‌ర్‌ను జ‌ట్టులో చేర్చుకున్న స‌న్‌రైజ‌ర్స్‌.. ఎవ‌రీ స్మరన్ రవిచంద్రన్?

Who is Smaran Ravichandran SRH announce replacement of Adam Zampa

Updated On : April 15, 2025 / 12:01 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌రుస ఓట‌ముల‌కు ముగింపు ప‌లికింది. పంజాబ్ కింగ్స్ పై అద్భుత విజ‌యాన్ని సాధించింది. గెలుపు జోష్‌ను కొన‌సాగించాల‌ని స‌న్‌రైజ‌ర్స్ భావిస్తోంది. అయితే.. ఆ జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు ఆడ‌మ్ జంపా గాయంతో ఈ సీజ‌న్‌లోని మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు.

అత‌డి స్థానంలో క‌ర్ణాట‌క‌కు చెందిన స్మ‌ర‌న్ ర‌విచంద్ర‌న్‌ను ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులోకి తీసుకుంది. రూ.30ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలో పాల్గొన్న అత‌డిని ఎవ్వ‌రూ కొనుగోలు చేయ‌లేదు. ఇప్పుడు జంపా గాయ‌ప‌డ‌డంతో బేస్ ప్రైజ్‌కే స‌న్‌రైజ‌ర్స్ అత‌డిని తీసుకుంది.

LSG vs CSK : చెన్నై చేతిలో ఎందుకు ఓడిపోయామంటే.. పంత్ కామెంట్స్ వైర‌ల్‌.. బిష్ణోయ్ చేత ఆఖ‌రి ఓవ‌ర్‌

స్మరన్ రవిచంద్రన్ ఎవరు?

స్మ‌ర‌న్ ర‌విచంద్ర‌న్ ఎడ‌మ చేతి వాటం ఆట‌గాడు. 21 ఏళ్ల ఈ ఆట‌గాడు క‌ర్ణాట‌క త‌రుపున దేశ‌వాళీలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు ఏడు ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్ ల‌ను ఆడాడు. 64.50 స‌గ‌టుతో 500 కంటే ఎక్కువ ప‌రుగులు సాధించాడు. ఇందులో ఓ డ‌బుల్ సెంచ‌రీ కూడా ఉంది. 10 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 72.16 స‌గ‌టుతో 433 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు శ‌త‌కాలు కూడా ఉన్నాయి. ఇక 6 టీ20 మ్యాచ్‌ల్లో 170 కి పైగా స్ట్రైక్‌రేట్‌తో 170 ప‌రుగులు చేశాడు.

PBKS vs KKR : కోల్‌క‌తాతో మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్‌.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు కొత్త క‌ష్టం..

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను ఏప్రిల్ 17 గురువారం ఆడ‌నుంది. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.