PBKS vs KKR : కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. శ్రేయస్ అయ్యర్‌కు కొత్త కష్టం..
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆడుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.065గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ ఆటగాడు లాకీ ఫెర్గూసర్ ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.
ఏప్రిల్ 12న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లాకీ ఫెర్గూసన్ గాయపడిన సంగతి తెలిసిందే. అతడు గాయం నుంచి కోలుకునేందుకు దాదాపు నాలుగు నుంచి ఐదు వారాలు పట్టవచ్చునని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు మిగిలిన ఈ సీజన్ కు దూరం అయ్యాడు.
అతడు తన స్వదేశం న్యూజిలాండ్‌కు వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. బలంగా తిరిగి రావాలని ఆకాంక్షించింది. ఈ సీజన్‌లో లాకీ మంచి రిథమ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.
Bounce back stronger, Lockie! 🙌🏻 pic.twitter.com/mioIK42wfC
— Punjab Kings (@PunjabKingsIPL) April 14, 2025
హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 245 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికి పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. లాకీ గాయపడడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని, జట్టుకు అవసరమైనప్పుడు అతడు వికెట్ తీస్తూ ఒత్తిడి పెంచేవాడని, అతడు గాయపడకుండా ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని ఎస్‌హెచ్‌తో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు లాకీ దూరం కావడం నిజంగా పంజాబ్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. అతడి స్ధానంలో జేవియర్ బార్ట్‌లెట్ లేదంటే అజ్మతుల్లా ఒమర్జాయ్ లకు తుది జట్టులో ఆడే అవకాశం ఉంది.
MS Dhoni : నాకు ఎందుకు ఈ అవార్డు.. నేనేమంతా గొప్పగా ఆడా.. అదే ఆలోచిస్తున్నా..