LSG vs CSK : చెన్నై చేతిలో ఎందుకు ఓడిపోయామంటే.. పంత్ కామెంట్స్ వైరల్.. బిష్ణోయ్ చేత ఆఖరి ఓవర్
చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓడిపోయిన తరువాత లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఎకానా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన చెన్నై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో రిషబ్ పంత్ (63)టాప్ స్కోర్లర్. సీఎస్‌కే బౌలర్లలో జడేజా, పతిరాణా చెరో రెండు వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
167 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబె (43 నాటౌట్; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు ఓడిపోవడానికి గల కారణాలను ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు. తాము 10 నుంచి 15 పరుగులు తక్కువగా చేశామని చెప్పాడు. దూకుడుగా ఆడుతున్నప్పుడు వికెట్లు కోల్పోయాము. దీంతో తాము మెరుగైన భాగస్వామ్యాలను నిర్మించలేకపోయామని తెలిపాడు. పిచ్ బాగుందని, అయితే.. కొన్ని బంతులు ఆగి వస్తున్నామన్నాడు.
ఇంకో 10 పరుగులు ఎక్కువ చేసి ఉంటే బాగుండేదన్నారు. అప్పుడు మ్యాచ్‌లో పట్టుచిక్కేదని తెలిపాడు. ప్రతి మ్యాచ్‌లోనూ తాను మెరుగ్గానే ఆడుతున్నానని, అయితే.. కొన్ని సార్లు విఫలం అవుతున్నానని చెప్పాడు. తాను ఫామ్‌లోకి వచ్చానని, మిగిలిన మ్యాచ్‌ల్లోనూ తాను కంటిన్యూ చేసేందుకు ప్రయత్నిస్తానన్నాడు.
బిష్ణోయ్‌కు ఓవర్ ఇవ్వకపోవడంపై..
ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ చక్కగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండు వికెట్లు తీశాడు. అతడితో మరో ఓవర్ వేయించి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేది కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై పంత్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్‌కు ఎక్కువ ఓవర్లు ఇవ్వలేకపోయాం. చాలా మంది ఆటగాళ్లతో మాట్లాడాను. ఈ రోజు అతడి చేత ఆఖరి ఓవర్ ను బౌలింగ్ చేయించలేకపోయామని చెప్పాడు. ఇక పవర్ ప్లేలో తమ బౌలింగ్ ఆందోళన కరంగా ఉందన్నాడు. ప్రతి మ్యాచ్ నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతామని పంత్ చెప్పాడు.