IPL 2025 : చెన్నై పరాజయాల పరంపరం కంటిన్యూ.. వరుసగా నాలుగో ఓటమి..

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.

IPL 2025 : చెన్నై పరాజయాల పరంపరం కంటిన్యూ.. వరుసగా నాలుగో ఓటమి..

Courtesy BCCI

Updated On : April 8, 2025 / 11:21 PM IST

IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. సీఎస్ కే మరో ఓటమి చవిచూసింది. ఈ సీజన్ లో సీఎస్కే కి ఇది వరుసగా నాలుగో పరాజయం. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై పరాజయం పాలైంది. 18 పరుగుల తేడాతో పంజాబ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.

220 పరుగుల టార్గెత్ బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేసింది. ఫలితంగా 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చెన్నై బ్యాటర్లలో డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 49 బంతుల్లో 69 పరుగులు చేసిన కాన్వే రిటైర్డ్ ఔట్ అయ్యాడు. శివమ్ దూబే 42 పరుగులు, ఎంఎస్ ధోని 27 పరుగులు చేశారు.

Also Read : సీఎస్‌కే వ‌రుస ఓట‌ములు.. ధోని, ఫ్లెమింగ్‌ల‌కు ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక లేదు..

చెన్నైతో పోరులో పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య సెంచరీతో చెలరేగాడు. చెన్నై బౌలర్లను ఊచకోత కోశాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఆర్య ఏ రేంజ్ లో వీరవిహారం చేశాడంటే.. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ బాదాడు. తొలుత 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 9 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ఓ ఎండ్ లో వికెట్లు పడుతున్నా ఆర్య మాత్రం బాదుడు ఆపలేదు. చెలరేగి ఆడుతున్న ఆర్యకు బంతి ఎక్కడ వేయాలో తెలియక సీఎస్ కే బౌలర్లు బెంబేలెత్తిపోయారు. కాగా, 103 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నూర్ అహ్మద్ బౌలింగ్ లో ఆర్య ఔటయ్యాడు.

ఈ సీజన్ లో ఇప్పటివరకు 5 మ్యాచులో ఆడిన సీఎస్కే.. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై గెలిచిన చెన్నై… ఆ తర్వాత వరుసగా ఓడుతూ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. అటు పంజాబ్ జట్టు ఈ సీజన్ లో ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడగా.. మూడింటిలో గెలుపొందింది. గత మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడిన పంజాబ్.. సీఎస్కేతో పోరులో విక్టరీ కొట్టింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.