IPL 2025 : ముంబై ఇండియన్స్ కి షాక్.. టేబుల్ టాపర్ గా పంజాబ్ కింగ్స్..
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

Courtesy BCCI
IPL 2025: కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. ముంబైపై ఘన విజయం సాధించింది. ఎంఐ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేజ్ చేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్.. 18.3 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
పంజాబ్ బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ హాఫ్ సెంచరీతో చెలరేగారు. ఇంగ్లిస్ 42 బంతుల్లో 73 పరుగులు చేయగా, ఆర్య 35 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో శాంటర్న్ 2 వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు.
ముంబై పై గెలుపుతో పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్ గా నిలిచింది. టాప్ 2 లో ఒక స్థానాన్ని కన్ ఫర్మ్ చేసేసుకుంది. పంజాబ్ తో మ్యాచ్ లో ఓటమితో టాప్ 2 రేస్ నుంచి తప్పుకున్న ముంబై ఎలిమినేటర్ ఆడనుంది.
Also Read: పోతూ.. పోతూ.. ధోని సేన ఎంత పని చేసింది మామ.. నాలుగు టీమ్‌ల భవిష్యత్తే మారిపోయిందిగా..