IPL 2025 SRH vs PBKS 98 pe single phir 99 pe single Mentor Yuvraj rates Abhishek hard hitting knock
ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 246 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 55 బంతుల్లోనే 141 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.
ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ (175 నాటౌట్), బ్రెండన్ మెకల్లమ్ (158 నాటౌట్) తర్వాత అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు.
కాగా.. అభిషేక్ ఇన్నింగ్స్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడి మెంటార్, టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సైతం అభిషేక్‌ను సోషల్ మీడియా వేదికగా పొగిడాడు. అభిషేక్ సెంచరీకి దగ్గరైన సమయంలో 98 పరుగుల వద్ద, 99 పరుగుల వద్ద సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్నే యువీ ప్రస్తావిస్తూ.. ఇంత పరిణితి ఎప్పుడెచ్చింది అంటూ కామెంట్ చేశాడు.
Wah sharma ji ke bete ! 98 pe single phir 99 pe single ! Itni maturity ha am nahi ho rahi 🤪 ! Great knock @IamAbhiSharma4 well played @TravisHead24 these openers are a treat to watch together ! #SRHvsPBKS @IPL well played @ShreyasIyer15 great to watch aswell
— Yuvraj Singh (@YUVSTRONG12) April 12, 2025
‘శర్మ గారి కొడుకు.. 98 వద్ద సింగిల్, 99 వద్ద సింగిల్.. ఇంత పరిణితి ఎప్పుడు వచ్చింది. చాలాబాగా ఆడాడు అభిషేక్. సన్‌రైజర్స్ ఓపెనర్లు ఇలా ఆడడం చూస్తుంటే చాలా బాగుంది. ఎస్ఆర్‌హెచ్‌కు మరో విజయం. శ్రేయస్ అయ్యర్ చాలా బాగా ఆడావు అంటూ యువీ ట్వీట్ చేశాడు.’ ప్రస్తుతం యువరాజ్ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఇక సెంచరీ చేసిన తరువాత అభిషేక్ మాట్లాడుతూ.. టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్‌కు తనకు అండగా నిలిచారన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో గొప్ప వాతావరణం ఉందన్నారు. వికెట్ పై కొంచెం బౌన్స్ ఉండడంతో ఈజీగా ఆడేలా కొన్ని కొత్త షాట్లను కొట్టే ప్రయత్నం చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక తల్లితండ్రుల సమక్షంలో సెంచరీ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.
ఓవర్ల మధ్యలో తాను, ట్రావిస్ హెడ్ ఏమీ మాట్లాడుకోలేదన్నాడు. సహజమైన ఆట ఆడేందుకు ప్రయత్నించినట్లుగా వివరించాడు. తొలి వికెట్ భాగస్వామ్యం తన ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసిట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సెంచరీ తనకు ఎంతో ప్రత్యేకమైందన్నాడు. తన మెంటార్ యువీ గురించి ప్రత్యేకంగా చెప్పాలన్నాడు. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్‌లు తనతో నిరంతరం మాట్లాడుతూ, మద్దతుగా ఉన్నారన్నాడు.