IPL 2025: ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌కు వర్షం ముప్పు..! మ్యాచ్ రద్దయితే ప్లే ఆఫ్స్‌కు చేరేదెవరు..? ఢిల్లీ గెలిస్తే ముంబై పరిస్థితి ఏమిటి..?
ఐపీఎల్- 2025 లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ముంబై, ఢిల్లీ ప్లే ఆఫ్స్ కోసం పోటీపడుతున్నాయి.

MI vs DC Match
IPL 2025: ఐపీఎల్-2025లో ప్లే ఆఫ్ బెర్తు కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇవాళ పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. అదే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధిస్తే ముంబై ప్లే ఆఫ్స్ కు చేరుకోవటం కష్టతరంగా మారుతుంది.
ఐపీఎల్- 2025 లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ముంబై, ఢిల్లీ ప్లే ఆఫ్స్ కోసం పోటీపడుతున్నాయి. ఇప్పటి వరకు ముంబై 12 మ్యాచ్ లు ఆడగా.. 14పాయింట్లతో నాల్గో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 12 మ్యాచ్ లు ఆడి 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్ లో ముంబై జట్టు గెలిస్తే 16 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.
వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఎవరికి మేలు..
♦ ఇవాళ జరిగే ముంబై, ఢిల్లీ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది.
♦ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రానున్న నాలుగు రోజుల్లో ముంబైలో వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే యెల్లో అలెర్ట్ కూడా జారీ అయింది. వర్షం పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
♦ ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.
♦ రెండు జట్లు ఆఖరి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తోనే తలపడనున్నాయి.
♦ మే 24న ఢిల్లీ జట్టు, మే 26న ముంబై జట్టు పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది.
♦ ఒకవేళ వర్షం కారణంగా బుధవారం నాటి మ్యాచ్ రద్దైతే.. ఢిల్లీ పంజాబ్‌పై ఎక్కువ రన్ రేట్ తో గెలవాలి.
♦ పంజాబ్‌పై గెలవడంతో పాటు.. ముంబై పంజాబ్ చేతిలో ఓడితేనే ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.
♦ ఒకవేళ పంజాబ్ చేతిలో ముందుగానే ఓడినా.. లేదంటే పంజాబ్‌పై ముంబై గెలిచినా ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోతుంది.
♦ ఒకవేళ పంజాబ్ తన రెండు చివరి మ్యాచ్ లు విజయం సాధిస్తే.. ముంబై ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.