IPL 2026: కీలక మ్యాచ్ లో ఢిల్లీ సూపర్ విక్టరీ.. పంజాబ్ కు వరుసగా నాలుగో ఓటమి
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.
IPL 2026: కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో సూపర్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. 211 రన్స్ టార్గెట్ ను ఢిల్లీ చేజ్ చేసింది. మరో 6 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఫినిష్ చేసింది. 3 వికెట్ల తేడాతో విజయదుంధుబి మోగించింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివరలో అశుతోష్ శర్మ (24) ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. దీంతో భారీ టార్గెట్ ను సైతం ఢిల్లీ ఈజీగా చేజ్ చేయగలిగింది. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఈ సీజన్ లో స్టార్టింగ్ లో వరుస విజయాలతో ప్రత్యర్థులను భయపెట్టిన పంజాబ్.. ఇప్పుడు వరుస ఓటములతో డీలా పడిపోయింది.
