IPL 2026 : SRH ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు..
IPL 2026 : మలింగ తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించగలడు. అతని రాకతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం మరింత పటిష్ఠంగా మారనుంది.
Eshan Malinga
- ఎస్ఆర్హెచ్ జట్టు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
- యార్కర్ల కింగ్ ఎషాన్ మలింగ జట్టులో చేరబోతున్నాడు
- శ్రీలంక క్రికెట్ బోర్డు ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ జారీ చేసింది
IPL 2026 Eshan Malinga : ఐపీఎల్ – 2026 టోర్నీ మార్చి28 నుంచి ప్రారంభం కానుంది. టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో అన్ని టీంలు సన్నద్ధమవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టుకూడా టోర్నీ విజేతగా నిలిచేందుకు పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో టోర్నీ ప్రారంభంలోనే ఎస్ఆర్హెచ్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. స్టార్ పేసర్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఎషాన్ మలింగ జట్టులో చేరబోతున్నాడు.
ఇంగ్లాండ్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 సిరీస్ సమయంలో ఎషాన్ మలింగ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతను టీ20 వరల్డ్ కప్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. ఐపీఎల్ -2026 టోర్నీకి సైతం అతను అందుబాటులో ఉండరని భావించారు. అయితే, తాజాగా.. మలింగ ఎస్ఆర్హెచ్ జట్టులో చేరబోతున్నాడు. ఒకట్రెండు రోజుల్లో ఎస్ఆర్హెచ్ జట్టుతో అతను కలవబోతున్నాడు. తన ఫిట్నెస్ టెస్టును మలింగ క్లియర్ చేశాడు. దీంతో ఐపీఎల్లో ఆడేందుకు అతడికి శ్రీలంక క్రికెట్ బోర్డు ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) మంజూరు చేసింది.
మలింగ తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించగలడు. అతని రాకతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం మరింత పటిష్ఠంగా మారనుంది. గత సీజన్లో కేవలం 7 మ్యాచ్‌లలో 13వికెట్లు తీసి సత్తాచాటాడు. అయితే, ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు ఎస్ఆర్హెచ్ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండరని ఇప్పటికే జట్టు యాజమాన్యం పేర్కొంది. తాత్కాలిక కెప్టెన్‌గా టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను నియమించింది. అయితే, బౌలింగ్ విభాగంలో కమిన్స్ లేనిలోటును మలింగ భర్తీ చేయనున్నాడు. ఇదిలాఉంటే.. ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. మార్చి 28న ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.
🚨 GREAT NEWS FOR SRH 🚨
– Eshan Malinga has been cleared to play in the IPL 2026. [CricWire] pic.twitter.com/jWn9fT1nme
— Johns. (@CricCrazyJohns) March 23, 2026
