IPL 2026: ఎట్టకేలకు బోణీ కొట్టిన గుజరాత్.. ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీ
IPL 2026: ఎట్టకేలకు గుజరాత్ టైటాన్స్ గెలుపు బోణీ కొట్టింది. ఈ సీజన్ లో తొలి విజయం నమోదు చేసింది. రెండు వరుస ఓటముల తర్వాత విజయదుందుభి మోగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విజయం సాధించింది.
చివరి బంతి వరకు ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. చివరికి ఒక్క రన్ తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇదే తొలి పరాజయం. వరుసగా రెండు మ్యాచులు గెలిచిన ఢిల్లీకి.. గుజరాత్ ఓటమి రుచి చూపించింది. మరోవైపు వరుసగా రెండు మ్యాచులు ఓడిన గుజరాత్.. మూడో మ్యాచ్ లో విజయాన్ని నమోదు చేసింది.
ఢిల్లీ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒంటరి పోరాటం చేశాడు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 52 బంతుల్లోనే 92 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఎండ్ లో డేవిడ్ మిల్లర్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 20 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. చివరి వరకు క్రీజులో ఉన్నా జట్టుని గెలిపించలేకపోయాడు.
