IPL 2026 LSG vs KKR : అతను కాదు.. మా ఓటమికి ప్రధాన కారణాలివే.. రిషబ్ పంత్ కీలక కామెంట్స్.. కొంపముంచిన నికోలస్
IPL 2026 LSG vs KKR : సూపర్ ఓవర్లో నికోలస్ పూరన్‌ను బ్యాటింగ్‌కు పంపించడానికి కారణంపై రిషబ్ పంత్ కీలక కామెంట్స్ చేశారు.
Rishabh Pant
- లక్నో వర్సెస్ కోల్‌కతా మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్
- సూపర్ ఓవర్లో విజేతగా నిలిచిన కోల్‌కతా
- లక్నో ఓటమిపై కెప్టెన్ రిషబ్ పంత్ కీలక కామెంట్స్
IPL 2026 LSG vs KKR : ఐపీఎల్ – 2026లో భాగంగా ఆదివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఎల్ఎస్జీ విజయానికి చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సిన సమయంలో బౌలర్ మహ్మద్ షమీ సిక్స్ కొట్టడంతో మ్యాచ్ డ్రా అయింది. ఆ తరువాత జరిగిన సూపర్ ఓవర్లో కేకేఆర్ జట్టు విజయం సాధించింది. చివరి వరకు నరాలుతెగే ఉత్కంఠను రేపిన మ్యాచ్‌లో ఎల్ఎస్జీ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కీలక కామెంట్స్ చేశాడు. మేము ఓడిపోవటానికి ప్రధాన కారణాలు ఇవే అంటూ పలు విషయాలను వెల్లడించారు.
Also Read : IPL 2026: లక్నో పరాజయాల పరంపర.. వరుసగా 5వ ఓటమి.. సూపర్ ఓవర్లో కోల్ కతా ఘన విజయం
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో రిషబ్ పంత్ మాట్లాడుతూ.. జట్టు పునరుత్తేజం పొందడానికి.. ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఓ చిన్న విరామం అవసరమని అనుకుంటున్నా. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది.. ఇది ఎల్లప్పుడూ ఒత్తిడితో కూడిన ఆటగానే ఉంటుంది. కానీ, ఇదే సమయంలో మనం బయట కాకుండా మనలోనే సమాధానాలు వెతుక్కోవాలి. మనం బాధ్యతీ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ.. అంటే ఇది జట్టులో ఒకరిద్దరి గురించి కాదు.. ఇది మొత్తం జట్టుకు సంబంధించినదిగా ఉండాలి. చాలా మంది ఖచ్చితంగా దాన్ని బాధ్యతగా తీసుకుంటారు అని పంత్ అన్నారు.
సూపర్ ఓవర్లో నికోలస్ పూరన్‌ను బ్యాటింగ్‌కు పంపించడానికి కారణంపై పంత్ స్పందిస్తూ.. సూపర్ ఓవర్ ముందు మేమంతా చర్చించుకున్నాం. ఆ చర్చలో నికోలస్ పూరన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అతను తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ, అదే సమయంలో, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు మీ ఆటగాడిని నమ్మాలి. ఈ విషయంలో ఎలాంటి సాకులు లేవు. కానీ, ప్రస్తుతం మా నిర్ణయం తగినంత సానుకూలత లేకపోవచ్చు. కానీ, రాబోయే మ్యాచ్ లలో మా నుంచి మెరుగైన ప్రదర్శన ఉంటుందని నేను నమ్ముతున్నాను అంటూ పంత్ చెప్పుకొచ్చారు.
చివరి ఓవర్ దిగ్వేష్ రాఠీతో బౌలింగ్ చేయించడం వెనుక ఆలోచన ఏమిటని ప్రశ్నించగా.. క్రికెట్లో బంతిని కాస్త టర్న్ చేయడానికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. కానీ, కొన్నిసార్లు బౌలర్లు కఠినమైన ఓవర్లు వేయాల్సి ఉంటుంది. చివర్లో దిగ్వేష్ ను వేయించడం వెనుక ఉన్న ఆలోచనా విధానం అదే. మైదానంలో చాలా మంది ఆలోచనలు కలిసికట్టుగా ఉండటం వల్ల పని సులభవం అవుతుంది. కానీ, కొన్నిసార్లు విఫలం అవుతాం కూడా అంటూ పంత్ సమాధానం ఇచ్చారు.
కొంపముంచిన పూరన్ వైఫల్యం..
ఈ టోర్నీలో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న నికోలస్ పూరన్‌ను సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు పంపించి లక్నో మూల్యం చెల్లించుకుంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ వేసిన సూపర్ ఓవర్ తొలి బంతికే నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి పంత్ సింగిల్ తీసివ్వగా.. మూడో బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఎయిడెన్ మార్క్రమ్ క్యాచ్ ఔటయ్యాడు.
