IPL 2026: లక్నోపై ముంబై విజయం
IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. 229 రన్స్ టార్గెట్ ను ముంబై మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసింది. 6 వికెట్ల తేడాతో లక్నోని చిత్తు చేసింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్లు రికల్టన్, రోహిత్ శర్మ చెలరేగారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు. రోహిత్ శర్మ 44 బంతుల్లో 84 పరుగులు, రిలక్టన్ 32 బంతుల్లో 83 రన్స్ చేశారు. ఈ సీజన్ లో లక్నోకి ఇది డబుల్ హాట్రిక్ ఓటమి. అటు హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై ఓ విజయం సాధించింది.
