Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఆహా.. ఏం కొట్టావ్ బాసూ.. ధోనీ, రోహిత్ రికార్డులు బద్దలు..
Virat Kohli : కేకేఆర్ జట్టుపై సెంచరీతో సూపర్ బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
Virat Kohli (credit @IPL)
- కేకేఆర్ జట్టుపై ఆర్సీబీ సూపర్ విక్టరీ
- సెంచరీతో అదరగొట్టిన కింగ్ కోహ్లీ
- ఐపీఎల్లో సరికొత్త రికార్డులు నమోదు చేసిన కోహ్లీ
Virat Kohli : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (royal challengers bengaluru) వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (kolkata knight riders) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read : BCCI : బుమ్రా, షమీల విషయంలో కీలక నిర్ణయం! సెలక్టర్లతో సమావేశం కానున్న బీసీసీఐ..
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేయగా.. ఆర్సీబీ జట్టు 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వీరవిహారం చేశాడు. బౌండరీల మోత మోగించాడు. ఫలితంగా 60 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు సిక్సుల సహాయంతో 105 (నాటౌట్) సెంచరీతో అరదగొట్టాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఐపీఎల్ టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
కేకేఆర్ జట్టుపై సెంచరీతో సూపర్ బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆర్సీబీ జెర్సీ ధరించి విరాట్ కోహ్లీ తన 279వ ఐపీఎల్ మ్యాచ్‌ను ఆడటం విశేషం. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలను కోహ్లీ అధిగమించాడు.
ధోనీ, రోహిత్ ఇద్దరూ చెరో 278 మ్యాచ్‌లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా.. ప్రస్తుతం వారి రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. 279 మ్యాచ్‌లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. అయితే, మహేంద్ర సింగ్ ధోనీ సీఎస్కే, ఫూణె జట్ల తరపున, రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడి ఈ మైలురాయిని చేరుకోగా.. విరాట్ కోహ్లీ మాత్రం కేవలం మొదటి నుంచి ఆర్సీబీ జట్టు తరపున ఆడుతూ ఈ ఘనత సాధించడం విశేషం.
కేకేఆర్ జట్టుపై సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ ఐపీఎల్లో తిరుగులేని మరో రికార్డును సాధించాడు. 279 మ్యాచ్‌లలో ఆయన ఇప్పటి వరకు 9,040 పరుగులు సాధించి ఐపీఎల్లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 7,289 పరుగులతో కోహ్లీ తరువాత స్థానంలో నిలవగా.. ఎంఎస్ ధోనీ 5,439 పరుగులు చేశాడు. మరోవైపు ఐపీఎల్లో విరాట్ తొమ్మిది సెంచరీలు చేశాడు. ఈ లీగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ అతడే. జోస్ బట్లర్ ఏడు సెంచరీలతో కోహ్లీ తరువాతి స్థానంలో ఉన్నాడు. మొత్తానికి పరుగుల రారాజు విరాట్ కోహ్లీ అన్ని విభాగాల్లోనూ రికార్డుల మోత మోగిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
RCB BACK AT THE TOP OF THE TABLE. 🔝
– Virat Kohli thanking God after playing a match winning hundred. ❤️ pic.twitter.com/xdssCGzckl
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 13, 2026
