IPL 2026: కోహ్లి అద్భుత శతకం.. కోల్ కతాపై బెంగళూరు ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
IPL 2026: కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లి సూపర్ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఆర్సీబీ విజయదుంధుబి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీతో కదం తొక్కాడు. 60 బంతుల్లోనే 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 3 సిక్సర్లు, 11 ఫోర్లు కొట్టాడు. విరాట్ సెంచరీతో బెంగళూరు గెలిచింది.
మరో 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను చేజ్ చేసింది ఆర్సీబీ. 6 వికెట్ల తేడాతో కేకేఆర్ ను చిత్తు చేసింది. ఈ ఘన విజయంతో పాయింట్ల టేబుల్ లో మరోసారి టాప్ కి దూసుకెళ్లింది ఆర్సీబీ. ప్లేఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. మరోవైపు ఆడిన 11 మ్యాచుల్లో 6 ఓటములతో తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది కేకేఆర్.
