Sanju Samson : ఎంఎస్ ధోని కీలక నిర్ణయం..! సీఎస్కే కెప్టెన్‌గా సంజూ శాంసన్!
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే తాత్కాలిక సారథిగా సంజూ శాంసన్ (Sanju Samson) బాధ్యతలను నిర్వర్తించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
IPL 2026 Sanju Samson may be CSK captain vs GT match
- నేడు గుజరాత్‌తో చెన్నై ఢీ
- గాయంతో మ్యాచ్‌కు దూరం కానున్న రుతురాజ్ గైక్వాడ్
- తాత్కాలిక సారథిగా సంజూ శాంసన్ బాధ్యతలు చేపట్టే అవకాశం
Sanju Samson : ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం పడుతూ లేస్తూ అన్న చందంగా సాగుతోంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేటు +0.118గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆదివారం (ఏప్రిల్ 26న) చెన్నైలోని చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు భారీ షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ రుతురాగ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా సంజూ శాంసన్ బాధ్యతలను నిర్వర్తించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై ఇప్పటి వరకు సీఎస్కే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఒకే రోజు 4 సార్లు చేతులు మారిన ఆరెంజ్ క్యాప్.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఆ నలుగురు వీళ్లే..
జింబాబ్వే మాజీ బౌలర్, వ్యాఖ్యాత పోమీ మ్బంగ్వా వెల్లడించిన వివరాల మేరకు.. గాయంతో రుతురాజ్ గైక్వాడ్ గుజరాత్‌తో మ్యాచ్‌కు తప్పుకున్నాడు. అతడు కోలుకుని తిరిగి వచ్చే వరకు సంజూ శాంసన్ తాత్కాలిక సారథిగా బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలిపాడు. సంజూ శాంసన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని అన్నాడు. టీ20 ప్రపంచకప్ ఫామ్‌ను అతడు ఇక్కడ కూడా కొనసాగిస్తున్నాడని తెలిపారు. మరోవైపు ఎంఎస్ ధోని అందుబాటుపై ఇంకా స్పష్టత లేదన్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. 15 కంటే తక్కువ సగటుతో 120 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌తో 107 పరుగులు చేశాడు.
ఎంఎస్ ధోని కీలక నిర్ణయం..
ధోని రీ ఎంట్రీ పై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. వారికి నిరాశ మిగిలే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ధోని తన రీ ఎంట్రీపై జట్టు యాజమాన్యానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
తాను పూర్తి ఫిట్నెస్ సాధించినప్పటికి కూడా తనను జట్టులోకి తీసుకునేందుకు ప్రస్తుతం ఉన్న కాంబినేషన్ ను పాడు చేయవద్దని కోరాడట. టీమ్ సమతుల్యత దెబ్బతినకుండా ఉండేదుకు ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
