Vaibhav Sooryavanshi : ఉప్ప‌ల్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ మెరుపులను ఆప‌డం స‌న్‌రైజ‌ర్స్‌కు సాధ్య‌మేనా?

రాజ‌స్థాన్ విజ‌యాల్లో 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi ) కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

IPL 2026 SRH vs RR Can Sunrisers stop Vaibhav Suryavanshi today (pic credit@ipl)

  • సోమ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్
  •  భీక‌ర ఫామ్‌లో ఉన్న వైభ‌వ్ సూర్య‌వంశీని నిలురించేనా?

Vaibhav Sooryavanshi  : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా సోమ‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ సీజ‌న్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించిన రియాన్ ప‌రాగ్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తమ విజ‌య‌ప‌రంప‌ర‌ను కొన‌సాగించాల‌ని చూస్తోంది. ఇక రాజ‌స్థాన్ విజ‌యాల్లో 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi ) కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజ‌న్‌లో అత‌డు బౌల‌ర్ల‌కు నిద్ర‌లేని రాత్రుళ్లు మిగులుస్తున్నాడు. 4 మ్యాచ్‌ల్లో 50 స‌గ‌టు 266.67 స్ట్రైక్‌రేటుతో 200 ప‌రుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

SRH vs RR : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌.. హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్, తుది జ‌ట్ల అంచ‌నా

ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో అత్యుత్త‌మ బౌల‌ర్లు అయిన జ‌స్‌ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్ వంటి మేటి బౌల‌ర్ల‌ను సైతం ఏ బెరుకు లేకుండా సూర్య‌వంశీ ఎదుర్కొన్నాడు. వారి బౌలింగ్‌లోనూ భారీగా ప‌రుగులు రాబ‌ట్టాడు. ప్ర‌స్తుతం భీక‌ర ఫామ్‌లో ఉన్న అత‌డిని బ‌ల‌హీనంగా ఉన్న స‌న్‌రైజ‌ర్స్ బౌలింగ్ ఏ మేర‌కు అడ్డుకుంటుంది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

అత‌డిని ఆరంభంలోనే పెవిలియ‌న్‌కు చేర్చ‌కుంటే స‌న్‌రైజ‌ర్స్ ఎదుట భారీ ల‌క్ష్యం నిలిచే అవ‌కాశం ఉంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఛేజింగ్ అయినా కూడా అత‌డు 5 నుంచి 6 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్‌ను లాగేసుకుంటాడ‌ని అంటున్నారు. వైభ‌వ్ సూర్య‌వంశీని ఎంత త్వ‌ర‌గా ఔట్ చేస్తారు అన్న దానిపైనే స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుందని చెబుత‌న్నారు.

IPL 2026 : సోద‌రుడు హార్దిక్ ఔట్ కాగానే కాస్త అతిగా సంబ‌రాలు చేసుకున్న కృనాల్ పాండ్యా.. వీడియో వైర‌ల్‌..

ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే ఉప్ప‌ల్ చేరుకున్న రెండు జ‌ట్లు హోరాహోరీగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.