SRH vs RR : సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్.. హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్, తుది జట్ల అంచనా
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR) జట్టు తలపడనుంది.
Today match between Sunrisers Hyderabad and Rajasthan Royals in IPL 2026
SRH vs RR : ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ నేటి మ్యాచ్‌లోనూ గెలిచి తమ విజయపరంపరను కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు సన్‌రైజర్స్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడగా ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. హోం గ్రౌండ్లో జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి విజయాల బాట పట్టాలని సన్‌రైజర్స్ పట్టుదలగా ఉంది.
రాజస్థాన్ విజయాల్లో ప్రధానంగా వారి ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీల పాత్ర ఉంది. వీరిద్దరు పవర్ ప్లేలో చాలా దూకుడుగా ఆడుతూ మెరుపు ఆరంభాలను అందిస్తున్నారు. వన్‌డౌన్‌లో వస్తున్న ధ్రువ్జురెల్తో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్ సమయోచితంగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్లు పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి ఓపెనర్లకు చుక్కలు చూపిస్తుండగా.. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాలు వికెట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు సన్‌రైజర్స్ కు కూడా ఓపెనర్లు మెరుపు ఆరంభాలను అందిస్తున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో పాటు హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ లు రాణిస్తే సన్‌రైజర్స్ భారీ స్కోరు సాధిస్తుంది. అయితే.. బలహీనమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ సతమతమవుతోంది. గత మ్యాచ్‌లో 220 పరుగులను కూడా సన్‌రైజర్స్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు.
హెడ్-టు-హెడ్..
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటి వరకు 21 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 9 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది.
పిచ్ ..
ఉప్పల్ మైదానం సాధారణంగా బ్యాటర్లకు స్వర్గధామంగా ఉంటుంది. ఇరు జట్లలోనూ భీకర హిట్టర్లు ఉండడంతో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గు చూపించవచ్చు.
వాతావరణం..
మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు. రాత్రంతా ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశం ఉంది.
తుది జట్ల అంచనా..
సన్‌రైజర్స్ హైదరాబాద్..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షిల్ పటేల్, ఈషాన్ మలింగ
ఇంపాక్ట్ సబ్.. లియామ్ లింగ్ స్టోన్ హింజ్ డస్ట్
రాజస్థాన్ రాయల్స్..
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్
ఇంపాస్ట్ సబ్.. బ్రిజేష్ శర్మ
