IPL 2026: హైదరాబాద్ ఘన విజయం.. పంజాబ్ హ్యాట్రిక్ పరాజయం
తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది.
IPL 2026: పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపింది. పంజాబ్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (69), ఇషాన్ కిషన్ (55) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 236 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ 202 పరుగులకే పరిమితమైంది. దాంతో 33 రన్స్ తేడాతో హైదరాబాద్ విక్టరీ కొట్టింది.
పంజాబ్ బ్యాటర్లలో కూపర్ కాన్లీ వీరోచిత పోరాటం చేశాడు. సెంచరీతో కదం తొక్కాడు. 57 బంతుల్లోనే శతకం బాదాడు. 8 సిక్సర్లు కొట్టాడు. సెంచరీ బాదినా, చివరి వరకు క్రీజులో ఉన్నా.. జట్టుకి ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు. ఈ సీజన్ లో పంజాబ్ కు ఇది హ్యాట్రిక్ పరాజయం. ఇక ఘన విజయంతో హైదరాబాద్ పాయింట్స్ టేబుల్ లో టాప్ లోకి దూసుకెళ్లింది.
