IPL Auction: పంజాబ్‌కు శిఖర్ ధావన్, రాజస్థాన్‌కు అశ్విన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఆరంభమైంది. డిమాండ్ ఉన్న ప్లేయర్లపై వేలం జరుగుతుండగా ముందుగా శిఖర్ ధావన్ ను పంజాబ్ జట్టు రూ.8.25కోట్లకు కొనుగోలు చేసింది.
IPL Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఆరంభమైంది. డిమాండ్ ఉన్న ప్లేయర్లపై వేలం జరుగుతుండగా ముందుగా శిఖర్ ధావన్ ను పంజాబ్ జట్టు రూ.8.25కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ వేలానికి వదిలేయడంతో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
మరో ఢిల్లీ జట్టు మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ను రాజస్థాన్ సొంతం చేసుకుంది. ప్రారంభ ధర రూ.2కోట్లు ఉన్న అశ్విన్ రూ.5కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.
పాట్ కమిన్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.7.25కోట్లకు సొంతం చేసుకుంది.
దక్షిణాప్రికా పేసర్ కగిసో రబాడను ఢిల్లీ క్యాపిటల్స్ వేలానికి వదిలిపెట్టేయగా పంజాబ్ కింగ్స్ రూ.9.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో పంజాబ్ రెండో ప్లేయర్ ను దక్కించుకుంది.
Read Also: రూ.562కోట్లతో 10 జట్లు, రెండ్రోజుల వేలం పూర్తి వివరాలు
Congratulations to @SDhawan25 #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/8LepZC7F2R
— IndianPremierLeague (@IPL) February 12, 2022
Congratulations @ashwinravi99 on being a part of @rajasthanroyals #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/hxXN8g8Nmv
— IndianPremierLeague (@IPL) February 12, 2022