IPL : ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఈ రోజుకు ఓ ప్ర‌త్యేకత.. ఆ మ్యాచ్‌లో ఆడిన వాళ్ల‌లో ఇప్పుడు ఎంత మంది ఆడుతున్నారంటే?

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఈ రోజుకు ఓ ప్ర‌త్యేకత ఉంది.

Indian Premier League : మ‌న దేశంలో క్రికెట్ పిచ్చిని మ‌రో లెవ‌ల్‌కు తీసుకువెళ్లింది ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. 16 సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం 17 సీజ‌న్ న‌డుస్తోంది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఈ రోజుకు ఓ ప్ర‌త్యేకత ఉంది. 2008 ఏప్రిల్ 18న ఐపీఎల్ మొద‌టి సీజ‌న్ ఆరంభ‌మైంది. రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి మ్యాచ్ జ‌రిగింది. ఆనాటి మ్యాచ్‌కు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదికైంది.

కాగా.. ఐపీఎల్ ఆరంభాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ త‌మ జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకుంటున్నారు. అయితే.. ఓ నెటిజ‌న్ వేసిన ప్ర‌శ్న ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో ఆడిన వారిలో ఎంత మంది ప్ర‌స్తుతం ఆడుతున్నారు అనే ప్ర‌శ్న‌వేశాడు.

IPL 2024 : ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు చేసిన ఐదు జట్లు ఇవే..

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. ముగ్గురు మాత్ర‌మే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో ఆడిన వాళ్లు ప్ర‌స్తుత ఐపీఎల్‌ను ఆడుతున్నారు. ఆ ముగ్గురే వృద్దిమాన్ సాహా, ఇషాంత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి. వీరిలో వృద్దిమాన్ సాహా, ఇషాంత్ శ‌ర్మ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్ త‌రుపున ఆడారు. ప్ర‌స్తుతం సాహా గుజ‌రాత్ టైటాన్స్‌, ఇషాంత్ శ‌ర్మ ఢిల్లీ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

ఇక కోహ్లి విష‌యానికి వ‌స్తే.. అప్పుడు, ఇప్పుడు కూడా బెంగ‌ళూరుకే ఆడుతున్నాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఆరంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టు మార‌ని ఏకైక ఆట‌గాడిగా కోహ్లి నిలిచాడు.

MS Dhoni : ధోని ఐపీఎల్ 2025 సీజ‌న్ ఆడతాడా..? ఒక్క ముక్క‌లో చెప్పేసిన సురేశ్ రైనా

ఇక ఆనాటి మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ (158; 73 బంతుల్లో 10 ఫోర్లు, 13సిక్స‌ర్లు) వీర‌విహారం చేయ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 222 ప‌రుగులు చేసింది. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో జ‌హీర్ ఖాన్‌, జాక్ క‌లిస్‌, ఆష్లే నోఫ్కే త‌లా ఓ వికెట్ తీశారు.

అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీ 82 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. బౌల‌ర్ ప్ర‌వీణ్ కుమార్ (18నాటౌట్‌) మాత్ర‌మే రెండు అంకెల స్కోరు చేశాడు. కెప్టెన్ రాహుల్ ద్ర‌విడ్ (2), వ‌సీం జాఫ‌ర్ (6), విరాట్ కోహ్లి (1), జాక్వెస్ క‌లిస్ (8), కామెరూన్ వైట్ (6), మార్క్ బౌచ‌ర్ (7) లు విఫ‌లం అయ్యారు. దీంతో కేకేఆర్ 140 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

17 YEARS OF THE IPL…!!! 💥

The greatest league in the world started on this day in 2008. 🇮🇳 pic.twitter.com/BPApcjBkOL

— Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2024

ట్రెండింగ్ వార్తలు