IPL 2024 : ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు చేసిన ఐదు జట్లు ఇవే..

2017లో కేకేఆర్ జట్టుపై ఆర్సీబీ కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు సాధించిన అత్యల్ప స్కోర్ ఇదే.

IPL 2024 : ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు చేసిన ఐదు జట్లు ఇవే..

IPL History

Gujarat Titans vs Delhi Capitals : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. బుధవారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ బౌలర్ల దాటికి 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. 90 ప‌రుగుల స్వ‌ల్ప లక్ష్యంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా.. కేవలం 8.5 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, ఐపీఎల్ చరిత్రలో 89 పరుగుల కంటే తక్కువ స్కోర్ నమోదు చేసిన జట్లు ఉన్నాయి.

Also Read : Rishabh Pant : కెప్టెన్‌గా, వికెట్ కీప‌ర్‌గా అదరగొట్టిన రిషబ్ పంత్.. వీడియోలు వైరల్

  • 2017లో కేకేఆర్ జట్టుపై ఆర్సీబీ కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు సాధించిన అత్యల్ప స్కోర్ ఇదే.
    2009లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆర్సీబీ చేతిలో కేవలం 58 పరుగులకే ఆలౌట్ అయింది.
    2023లో ఆర్సీబీ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టును 59 పరుగులకే కట్టడి చేసింది.
    2017లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కేవలం 66 పరుగులకే కట్టడి చేసింది.
    2008లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు కేవలం 67 పరుగులకే ఆలౌట్ అయింది.
    2017 సీజన్ లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 67 పరుగులకే ఆలౌట్ అయింది.

IPL 2024: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు