IPL 2024: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు

హైదరాబాద్ జట్టు 2024 మార్చి 27న 277/3 పరుగులు చేసి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు..

IPL 2024: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 2024 మార్చి 27న హైదరాబాద్ జట్టు 277/3 పరుగులు చేసిన ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ తన రికార్డును తానే బద్దలు కొడుతూ 287 పరుగులు చేసింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ జరిగిన మ్యాచులో ఈ స్కోరు నమోదైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టులో ట్రావిస్‌ హెడ్‌ 102, క్లాసెన్‌ 67, అభిషేక్‌ 34, మార్‌క్రమ్‌ 32 నాటౌట్, సమద్‌ 37 నాటౌట్ పరుగులతో మెరుపులు మెరిపించారు.

మొదటి నుంచి హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ధాటిగా ఆడారు. వారు మెరిపించిన మెరుపులకు స్టేడియం మొత్తం విజిల్స్ తో దద్దరిల్లిపోయింది. కాగా, బెంగళూరు జట్టు బౌలర్లలో ఫెర్గుసన్‌ 2 వికెట్ల తీయగా, టాప్లే ఒక వికెట్‌ తీశాడు.

 టాప్‌ స్కోర్లు ఇవే..

  • హైదరాబాద్‌ 287/3 వర్సెస్ బెంగళూరు
  • హైదరాబాద్‌ 277/3 వర్సెస్ ముంబయి
  • కోల్‌కతా 272/7 వర్సెస్ ఢిల్లీ
  • బెంగళూరు 263/5 వర్సెస్ పుణె
  • లక్నో 257/5 వర్సెస్ పంజాబ్‌
  • బెంగళూరు 248/3 వర్సెస్ గుజరాత్‌ లయన్స్‌

Animal Park : ‘యానిమల్ పార్క్’ ఇప్పటిలో చేసేది లేదు.. సందీప్ వంగ షాకింగ్ కామెంట్స్..