IPL 2020 : కార్తీక్‌కు అగ్ని పరీక్ష, కోల్‌కతా – చెన్నై మధ్య బిగ్‌ఫైట్

  • Published By: madhu ,Published On : October 7, 2020 / 11:50 AM IST
IPL 2020 : కార్తీక్‌కు అగ్ని పరీక్ష, కోల్‌కతా – చెన్నై మధ్య బిగ్‌ఫైట్

Updated On : October 7, 2020 / 12:12 PM IST

ipl 2020 kkr vs csk : ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. అబుదాబి వేదికగా జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైజర్స్ జట్లు తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌‌ కంటే నైట్​రైడర్స్​కెప్టెన్ దినేశ్ ​కార్తీక్‌‌​పైనే అందరి దృష్టి ఉంది.



కార్తీక్ వైఫల్యం టీమ్‌కు పెద్ద సమస్యగా తయారైంది. ఇటు కెప్టెన్‌గా అటు బ్యాట్స్‌మన్‌గా ఘోరంగా విఫలమవుతున్నాడు. దీంతో 2020, అక్టోబర్ 07వ తేదీ బుధవారం జరిగే ఈ మ్యాచ్​ కార్తీక్‌కి అగ్ని పరీక్ష కానుంది. మరోవైపు హ్యాట్రిక్​ ఓటముల తర్వాత పంజాబ్‌పై విజయంతో చెన్నై గాడిలో పడింది. ఇక హెడ్‌ టు హెడ్‌ రికార్డులో కూడా చెన్నైదే పైచేయిగా ఉంది. రెండు జట్లు 23 సార్లు తలపడగా..సూపర్ కింగ్స్‌ 14 సార్లు గెలిచింది.



నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయలు, రెండు ఓటములతో కోల్‌కతా ప్రస్తుతం నాలుగో పోజిషన్‌లో ఉంది. అయితే నిలకడలేమి ఆ జట్టును వేధిస్తోంది. ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌లు కూడా ఈ సీజన్‌లో వరుసగా విఫలమవుతున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కమిన్స్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నాడు.



ఇయాన్ మోర్గాన్, నితీష్ రానా, శుభ్‌మన్ గిల్‌లు మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. ఇక కెప్టెన్‌ దీనేశ్‌ కార్తీక్‌ టీమ్‌కు పెద్ద సమస్యగా మారాడు. వరల్డ్ కప్ విన్నింగ్ ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్​టీమ్‌లో ఉన్నా.. కేకేఆర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కార్తీక్‌‌పైనే నమ్మకం ఉంచింది. కానీ దాన్ని కాపాడుకోవడంలో కార్తీక్‌ ఫెయిలవుతూనే ఉన్నాడు.



టాప్​క్లాస్​ప్లేయర్లను సరిగ్గా యూజ్​చేసుకోలేకపోతున్నాడు. దీంతో ఇవాళ మ్యాచ్‌లో అందరీ చూపు కార్తీక్‌పై పడింది. ధోనీ కెప్టెన్సీ ముందు దినేష్ కార్తీక్ నిలబడతాడా? అనేది సందేహంగానే ఉంది.



మరోవైపు పంజాబ్‌పై గెలుపుతో చెన్నై జోరు మీదుంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. వాట్సన్‌‌ ఫామ్‌‌లోకి రావడం సూపర్‌ కింగ్స్‌కు ప్లస్‌గా మారింది. డుప్లెసిస్ భీకర ఫామ్‌లో ఉండగా… రాయుడు కూడా బ్యాట్‌తో రెచ్చిపోతే చెన్నైకు తిరుగులేదు. బ్రావో, జడేజా, కరన్ చెలరేగితే నైట్‌‌రైడర్స్‌కు కష్టాలు తప్పవు. ఫినిషర్‌‌గా ధోనీ తన మార్క్‌‌ చూపితే..చెన్నైకు విజయం ఈజీ అవుతుంది. బౌలింగ్‌‌లోనూ చెన్నై లాస్ట్ మ్యాచ్‌లో ఇరగదీసింది.