IPL Auction 2022: ఐపీఎల్ వేలం ఎప్పుడు? ఎక్కడ? ఎవరి దగ్గర ఎంత ఉంది? పూర్తి వివరాలు ఇవే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వేలానికి సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా బీసీసీఐ చెబుతోంది

IPL Auction 2022: ఐపీఎల్ వేలం ఎప్పుడు? ఎక్కడ? ఎవరి దగ్గర ఎంత ఉంది? పూర్తి వివరాలు ఇవే!

Ipl (1)

Updated On : February 2, 2022 / 5:44 PM IST

IPL Auction 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వేలానికి సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా బీసీసీఐ చెబుతోంది. రెండు రోజుల పాటు జరిగే ఐపీఎల్-2022 వేలంలో 590 మంది ఆటగాళ్లు ఉండబోతున్నారు. ఈసారి ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్‌లు ఉండబోతున్నాయి.

ఐపీఎల్ వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనుంది.

వేలం కోసం ఎంత మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు
వేలం కోసం మొత్తం 1214 మంది ఆటగాళ్లు నమోదు చేసుకోగా, వారిలో 896 మంది భారతీయులు, 318 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

ఎంత మంది ఆటగాళ్లు షార్ట్ లిస్ట్ అయ్యారు?
590 మంది ఆటగాళ్లు వేలం కోసం షార్ట్‌లిస్ట్ అవ్వగా, వారిలో 370 మంది భారతీయులు, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

రెండు కొత్త జట్లు ఏవి?
IPL-2022 టోర్నమెంట్‌లో రెండు కొత్త జట్లు ఆడబోతున్నాయి. అందులో ఒకటి లక్నో జట్టు కాగా.. మరొకటి అహ్మదాబాద్ జట్టు.

బేస్ ధర?
ఆటగాళ్ల అత్యధిక బేస్ ధర రూ.2 కోట్లు కాగా.. ఈ కేటగిరీలోని ఆటగాళ్లందరి బిడ్డింగ్ రూ.2 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది.

ఏ భారతీయ ఆటగాడు అత్యధిక బేస్ ధరను కలిగి ఉన్నాడు?
రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ కేటగిరీలో భారత్‌ నుంచి మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, చాహల్, దీపక్ చాహర్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, సురేష్ రైనా, అంబటి రాయుడు, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, రాబిన్ ఉతప్ప, ఉమేష్ యాదవ్.

రూ.2 కోట్ల విభాగంలో విదేశీ ఆటగాళ్లు:
ఈ విభాగంలో మొత్తం 31 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, కమిన్స్, రబడ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్లు మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ ఈ లిస్ట్‌లో ఉన్నారు.

రూ.1.5 కోట్ల కేటగిరీలో ఎంత మంది ఆటగాళ్లు ఉన్నారు?
2 కోట్ల తర్వాత 1.5 కోట్లు, 1 కోట్లు అనే రెండు కేటగిరీలు ఉండగా.. 1.5 కోట్ల విభాగంలో మొత్తం 20 మంది ఆటగాళ్లు, రూ.కోటి కేటగిరీలో 34 మంది ఆటగాళ్లు ఉన్నారు.

లక్నో, అహ్మదాబాద్ జట్లు ఎవరిని తీసుకున్నాయి?
కేఎల్ రాహుల్, రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిస్‌లను లక్నో తీసుకోగా.. హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను అహ్మదాబాద్ కొనుక్కుంది.

ఏ జట్టు దగ్గర ఎంత డబ్బు ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ – 48 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ – 47.5 కోట్లు
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ – 48 కోట్లు
ముంబై ఇండియన్స్ – 48 కోట్లు
పంజాబ్ కింగ్స్ – 72 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ – 62 కోట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్ – 68 కోట్లు
లక్నో – 59 కోట్లు
అహ్మదాబాద్ – 52 కోట్లు

ఫ్రాంచైజీ ఎంత మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు?
ఫ్రాంచైజీలో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను కొనుక్కోవచ్చు

క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఎంతమంది?
590 మంది ఆటగాళ్లలో 228 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉన్నారు. అందులో ఏడుగురు ఆటగాళ్లు అసోసియేట్ దేశాలవారు.

విదేశీ ఆటగాళ్లు అత్యధికంగా ఉన్న దేశం ఏది?
47 మంది క్రికెటర్లతో అత్యధిక విదేశీ ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, 34 మంది వెస్టిండీస్ క్రికెటర్లు, దక్షిణాఫ్రికా నుంచి 33మంది, శ్రీలంక నుంచి 23మంది, ఇంగ్లండ్ నుంచి 24మంది, న్యూజిలాండ్ నుంచి 24మంది, అఫ్ఘానిస్థాన్ నుంచి 17 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు.

పెద్దోడు.. చిన్నోడు..
ఈ వేలంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (42) అత్యంత వయస్సులో పెద్దవాడు కాగా.. అఫ్గానిస్థాన్‌ ఆటగాడు నూర్ అహ్మద్(17) చిన్నవాడు. నూర్ ప్రస్తుతం వెస్టిండీస్‌లో అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్నాడు.