అరగంట ముందే.. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లు

అరగంట ముందే.. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లు

Updated On : April 27, 2019 / 1:25 PM IST

ప్రపంచంలోని అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. దాదాపు లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తి చేసేసుకుంది. ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మినహాయిస్తే మిగిలిన జట్లన్నీ 11మ్యాచ్‌లు పూర్తి చేసేసుకున్నాయి. ఇక ప్లే ఆఫ్‌కు సిద్ధమవుతోన్న తరుణంలో బీసీసీఐ ప్లే ఆఫ్‌ల కోసమే ప్రత్యేకంగా టైమింగ్స్ మార్పులు చేసింది. 

లీగ్ మ్యాచ్‌లు 8గంటలకు జరుగుతున్న క్రమంలో ప్లే ఆఫ్ మ్యాచ్‌లను అరగంట ముందే నిర్వహించాలని యోచిస్తోంది. ఢిల్లీలో శనివారం సమావేశమైన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. గత సీజన్లోనూ షెడ్యూల్‌ను ఇలా అరగంటముందుకు జరిపింది. అంటే ఇక టాస్ 7గంటలకే తేలిపోతుంది. మ్యాచ్‌లలో పలుకారణాల రీత్యా అర్దరాత్రి దాటిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. 

స్లో ఓవర్ రేట్, డ్రింక్స్ బ్రేక్, ఆట వస్తువులు మార్చుకోవడం వల్ల అనుకున్న సమయం కంటే ఎక్కువ సేపు పడుతుందట. ఈ మధ్యనే ఇలా స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, మహేంద్ర సింగ్ ధోనీలకు రూ.12లక్షల జరిమానా విధించారు.