IPL2022 CSK Vs PBKS : చెన్నైకి ఏమైంది? హ్యాట్రిక్ ఓటమి.. పంజాబ్ ఘన విజయం

ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. 54 పరుగుల తేడాతో చెన్నైని..

IPL2022 CSK Vs PBKS : చెన్నైకి ఏమైంది? హ్యాట్రిక్ ఓటమి.. పంజాబ్ ఘన విజయం

Ipl2022 Csk Vs Pbks

Updated On : April 3, 2022 / 11:38 PM IST

IPL2022 CSK Vs PBKS : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. 54 పరుగుల తేడాతో చెన్నైని చిత్తు చేసింది పంజాబ్. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ చేసింది. 181 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై జట్టు.. 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

IPL 2022 : గుజరాత్-ఢిల్లీ మ్యాచ్‌లో ట్విస్ట్.. లలిత్ యాదవ్ ఎలా రనౌట్ అయ్యాడంటే?

చెన్నై బ్యాటర్లలో శివమ్ దూబే ఒక్కడే పోరాడాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. దూబే 30 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఎం.ఎస్. ధోనీ 28 బంతుల్లో 23 పరుగులు చేశాడు. చెన్నై జట్టులో టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ మూడు వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా, లివింగ్ స్టోన్ తలో రెండు వికెట్లు తీశారు. రబాడ, అర్ష్ దీప్ సింగ్, ఓడియన్ స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా, పంజాబ్ ప్లేయర్ లియామ్ లివింగ్ స్టోన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్ లో 60 పరుగులు చేసిన లివింగ్ స్టోన్.. బౌలింగ్ లో రెండు వికెట్లు తీసి.. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.(IPL2022 CSK Vs PBKS)

చెన్నై సూపర్ కింగ్స్ తో పోరులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ 32 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 24 బంతుల్లో 33, జితేశ్ శర్మ 17 బంతుల్లో 26 పరుగులు చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ 3 సిక్సులు బాదాడు. చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్, ప్రిటోరియస్ తలో రెండు వికెట్లు తీశారు. ముఖేశ్ చౌదరి, బ్రావో, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

ICC CEO : ఒలింపిక్స్‌‌లో క్రికెట్.. సంపాదన కోసం కాదన్న ICC సీఈవో

తన రెండో మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా లక్నోని ఆడ్డుకోలేకపోయిన చెన్నై.. ఈసారి విజయంతో బోణీ కొట్టాలని భావించింది. కానీ, ఆశలు ఆవిరయ్యాయి. ఈ టోర్నీలో వరుసగా మూడో ఓటమి ఎదురైంది. మరోవైపు భారీ స్కోరు మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన పంజాబ్‌.. తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో భంగపాటుకు గురైంది. బ్యాటర్లు, బౌలర్లు ఘోరంగా విఫలం కావడంతో కోల్‌కతాను ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. తాజాగా చెన్నైతో మ్యాచ్‌లో పంజాబ్‌ ఘన విజయాన్ని నమోదు చేసింది.

జట్ల వివరాలు:

చెన్నై : రుతురాజ్‌ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోనీ, శివమ్‌ దూబే, డ్వేన్‌ బ్రావో, క్రిస్‌ జొర్డాన్‌, డ్వేన్ ప్రిటోరియస్‌, ముకేశ్ చౌదరి

పంజాబ్‌ : మయాంక్‌ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్‌ లివింగ్ స్టోన్, షారుఖ్‌ ఖాన్‌, జితేశ్‌ శర్మ, ఓడియన్ స్మిత్, అర్ష్‌దీప్‌ సింగ్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్‌ అరోరా