Ipl2022 Mi Vs Csk
IPL2022 MI Vs CSK : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై ముందు 156 పరుగుల టార్గెట్ ఉంచింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. తిలక్ వర్మ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 3 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి మూడు వికెట్లు పడగొట్టాడు. డ్వేన్ బ్రావో రెండు వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్, మహీశా తీక్షణ చెరో వికెట్ తీశారు.
డూ ఆర్ డై లాంటి కీలక మ్యాచ్‌లోనూ మాజీ ఛాంపియన్ల ఆటతీరు అస్సలు మారలేదు. ముంబై కీలక బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. అటు చేతికి చిక్కిన క్యాచ్ లను చెన్నై చేజార్చుకుంది. కాగా.. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (51*) కాకుండా సూర్యకుమార్ యాదవ్ (32), హృతిక్ షోకీన్ (25) మాత్రమే ఫర్వాలేదనిపించారు. రోహిత్ (0), ఇషాన్ కిషన్ (0) డకౌట్ కాగా.. బ్రెవిస్ (4), కీరన్ పొలార్డ్ (12), డానియల్ సామ్స్ (5*) విఫలమయ్యారు. ఆఖర్లో జయ్‌దేవ్ ఉనద్కత్ (19*.. ఒక సిక్స్, ఒక ఫోర్)తో తిలక్ వర్మ 16 బంతుల్లో 35 పరుగులు జోడించాడు. చెన్నై ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లను డ్రాప్ చేశారు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో చెన్నైకి మంబై ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించగలిగింది.
IPL 2022 David Warner : ఒకే ప్రత్యర్థి జట్టుపై వెయ్యి పరుగులు.. డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి తొలి ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది. చెన్నై పేసర్ ముకేశ్ చౌదరి చెలరేగడంతో ఓపెనర్లు రోహిత్ శర్మ (0) ఇషాన్ కిషన్ (0) డకౌట్‌గా వెనుదిరిగారు.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు.. గత సీజన్ వరకు టాప్ జట్లు. ఈసారి మాత్రం దారుణమైన పరిస్థితి ఆ జట్లది. విజయాల కోసం వెంపర్లాడాల్సిన దుస్థితి. టీ20 లీగ్ చరిత్రలోనే అత్యధిక సార్లు టైటిళ్లను గెలుచుకున్న జట్లుగా రికార్డు సృష్టించిన ముంబై (5సార్లు), చెన్నై (4) ప్రస్తుతం సీజన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లూ ఆరేసి మ్యాచ్‌లు ఆడగా.. చెన్నై కనీసం ఒక విజయం అయినా అందుకుంది. ముంబయి మాత్రం ఇంకా బోణీనే కొట్టలేదు. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గిన చెన్నై సారథి రవీంద్ర జడేజా బౌలింగ్ ఎంచుకుని ముంబైకి బ్యాటింగ్ అప్పగించాడు. మరి రోహిత్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఈసారైనా బోణీ కొడుతుందో లేదో చూడాలి.
Virat Kohli : ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ ఖాతాలో ఇదే చెత్త రికార్డు..
జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డేవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డానియల్ సామ్స్, హృతిక్ షోకీన్, మెరిడిత్, జయ్‌దేవ్ ఉనద్కత్, బుమ్రా
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు : రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోనీ, ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, మహీషా తీక్షణ, ముకేశ్ చౌదరి
Mukesh Choudhary is our Top Performer from the first innings for his bowling figures of 3/19.
A look at his bowling summary here ? #TATAIPL #MIvCSK pic.twitter.com/fM7wbGIGcR
— IndianPremierLeague (@IPL) April 21, 2022