Irfan Pathan : ఇంకా కొంద‌రు ముంబై ప్లేయ‌ర్లు రోహితే కెప్టెన్ అని భావిస్తున్నారు : ఇర్ఫాన్ ప‌ఠాన్

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న అంతంత‌మాత్రంగానే ఉంది.

Irfan Pathan – Hardik Pandya : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న అంతంత‌మాత్రంగానే ఉంది. జైపూర్ వేదిక‌గా సోమ‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ 9 తేడాతో ఓట‌మి పాలైంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది మ్యాచులు ఆడిన ముంబై జ‌ట్టు మూడు మ్యాచుల్లో గెలిచింది. మ‌రో ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. 6 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో కొన‌సాగుతోంది. వ‌రుస ఓట‌ముల నేప‌థ్యంలో ముంబై ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం అవుతున్నాయి.

ఈ క్ర‌మంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ ప‌ఠాన్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇంకా ముంబై జ‌ట్టులో కొంత మంది ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌నే కెప్టెన్‌గా అనుకుంటున్నార‌న్నాడు. పంజాబ్‌, ముంబై జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ను ఇందుకు ఊదాహ‌ర‌ణ‌గా తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆఖ‌రి ఓవ‌ర్‌లో ముంబై బౌల‌ర్ ఆకాశ్ మ‌ధ్యాల్.. రోహిత్ వ‌ద్ద‌కు వెళ్లాడు. బౌలింగ్ వ్యూహాలు, ఫీల్డింగ్ సెట‌ప్‌ల గురించి చ‌ర్చించాడు. ఆ ప‌క్క‌నే హార్దిక్ పాండ్య ఉన్న‌ప్ప‌టికీ అత‌డిని ప‌ట్టించుకోలేదు.

Sourav Ganguly : గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లి 40 బంతులు ఆడితే.. ఓపెన‌ర్‌గా మాత్రం..

‘ఒత్తిడిలో ఉన్న ఆకాశ్‌.. రోహిత్ శ‌ర్మ వ‌ద్ద‌కు వెళ్లాడు. ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ గురించి రోహిత్‌తో మాత్ర‌మే మాట్లాడాడు. అత‌డు నా కెప్టెన్.. మ‌రో వ్య‌క్తి కాదు అనే న‌మ్మ‌కం మ‌న‌లో ఉన్న‌ప్పుడు ఇలా జ‌రుగుతుంటుంది. ఈ విష‌యంలో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంది. హార్దిక్ పాండ్య దీన్ని చేయ‌గ‌ల‌డ‌ని నేను భావిస్తున్నాను. ‘అని ఇర్ఫాన్ ప‌ఠాన్ అన్నాడు.

ఐపీఎల్ 2024 సీజ‌న్ ముందు ఐదు సార్లు జ‌ట్టుకు ట్రోఫీని అందించిన రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం త‌ప్పించింది. అత‌డి స్థానంలో హార్దిక్ పాండ్య‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అయితే.. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొల‌గించ‌డం చాలా మంది అభిమానుల‌కు న‌చ్చ‌లేదు. అందుక‌నే ముంబై మ్యాచులు ఆడుతుండ‌గా హార్దిక్‌ను అవ‌హేళ‌న చేస్తున్నారు.

Yashasvi Jaiswal : టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ రికార్డును బ్రేక్ చేసిన జైస్వాల్‌..

ట్రెండింగ్ వార్తలు