Is Ravindra Jadeja Retiring from odis After champions trophy 2025 finalIs Ravindra Jadeja Retiring from odis After champions trophy 2025 final
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డేల నుంచి రిటైర్‌మెంట్ కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో జడేజా చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో జడేజా తన బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తి చేసిన అనంతరం స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో జడేజా కాస్త భావోద్వేగంతో కనిపించాడు. దీంతో వన్డేల్లో జడేజాకు ఇదే చివరి మ్యాచ్ కానుందనే ఊహాగానాలు మొదలు అయ్యాయి. మ్యాచ్ అనంతరం తన రిటైర్‌మెంట్ గురించి జడేజా అధికారికంగా ప్రకటించవచ్చునని అంటున్నారు.
కాగా.. కోహ్లీని, జడేజా కౌగిలించుకున్న ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్, కోహ్లీని కౌగిలించుకున్న దృశ్యాన్ని గుర్తుకు తెస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ సమయంలో స్మిత్, కోహ్లీలు భావోద్వేగంతో కనిపించారు. ఆ మరుసటి రోజే స్మిత్ వన్డేల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
గతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో అశ్విన్ భావోద్వేగపు సంబాషణ జరిపాడు. ఆ వీడియో వైరల్‌గా మారగా.. కొన్ని గంటల వ్యవధిలోనే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
దీంతో ఇప్పుడు కోహ్లీని జడేజా కౌగిలించుకోవడంతో మ్యాచ్ తరువాత వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించవచ్చునని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో జడేజా చక్కని ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లు వేసి 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కీలకమైన టామ్ లాథమ్ వికెట్ పడగొట్టాడు.
కాగా.. జడేజా ఇప్పటికే టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన వెంటనే పొట్టి ఫార్మాట్‌కు జడేజా వీడ్కోలు పలికాడు.
It’s last match for Ravindra Jadeja in the ODIs Happy Retirement ❤️ pic.twitter.com/78eIxKwSWL
— Ahmed Says (@AhmedGT_) March 9, 2025
Happy retirement Jadeja pic.twitter.com/dlvB2MzeIY
— Suprvirat (@ishantraj51) March 9, 2025
Virat Kohli hugged Ravindra Jadeja after he completed his last over. . Appreciation or Sign of Retirement? Jadeja playing his last ODI today ? #INDvsNZ pic.twitter.com/1FDYq9pjgS
— Shubhankar Mishra (@shubhankrmishra) March 9, 2025
After Smith now Kohli hugged Jadeja after Jaddu completed his spell 👀 pic.twitter.com/95x9C3hMur
— TukTuk Academy (@TukTuk_Academy) March 9, 2025