IND vs NZ : కుల్దీప్ దెబ్బ‌కు ర‌చిన్ ర‌వీంద్ర ఫ్యూజులు ఔట్‌.. బాల్ ఎలా తిరిగిందో చూశారా.. వీడియో వైర‌ల్‌

కుల్దీప్ యాద‌వ్ ఓ అద్భుత బంతితో ర‌చిన్ ర‌వీంద్ర‌ను క్లీన్ బౌల్డ్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

IND vs NZ : కుల్దీప్ దెబ్బ‌కు ర‌చిన్ ర‌వీంద్ర ఫ్యూజులు ఔట్‌.. బాల్ ఎలా తిరిగిందో చూశారా.. వీడియో వైర‌ల్‌

Kuldeep Yadav bowled Rachin Ravindra in Champions Trophy 2025 Final (PC:x.com/StarSportsIndia

Updated On : March 9, 2025 / 4:29 PM IST

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఆ జ‌ట్టు కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెన‌ర్లగా ర‌చిన్ ర‌వీంద్ర (37; 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), విల్ యంగ్ (15; 23 బంతుల్లో 2 ఫోర్లు) లు బ‌రిలోకి దిగారు.

ఓవైపు విల్ యంగ్ ఆచితూచి ఆడ‌గా.. మ‌రోవైపు ర‌చిన్ రెచ్చిపోయాడు. మొద‌టి మూడు ఓవ‌ర్ల పాటు ఆచితూచి ఆడిన ర‌చిన్ ర‌వీంద్ర.. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవ‌ర్‌లో బౌండ‌రీల‌తో రెచ్చిపోయాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవ‌ర్‌లో.. ఓ సిక్స్‌, రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో మొత్తం 16 ప‌రుగులు వ‌చ్చాయి. ష‌మీ వేసి ఇన్నింగ్స్‌ ఐదో ఓవ‌ర్‌లో ర‌చిన్ రెండు ఫోర్లు బాడంతో 11 ప‌రుగులు వ‌చ్చాయి.

Champions Trophy : అయ్యో పాపం రిష‌బ్ పంత్.. నిన్ను ఇలా చూస్తామ‌ని అనుకోలేదు.. వాట‌ర్ టిన్‌లు మోయ‌డం కోస‌మేనా..!

న్యూజిలాండ్ స్కోరు 7 ఓవ‌ర్ల‌లోనే 50 ప‌రుగులు దాటింది. ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడిని విల్‌యంగ్‌ను ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ చేయ‌డం ద్వారా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి విడ‌గొట్టాడు. దీంతో 57 ప‌రుగుల తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. మ‌రోవైపు ర‌చిన్ వ్య‌క్తిగ‌త స్కోరు 28 ప‌రుగుల వ‌ద్ద షమీ, 29 ప‌రుగుల వ‌ద్ద శ్రేయ‌స్ అయ్య‌ర్ లు క్యాచ్‌లు మిస్ చేశారు.

దీంతో వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుని ర‌చిన్ భారీ స్కోరు చేస్తాడ‌ని అంతా భావించారు. అయితే.. కుల్‌దీప్ యాద‌వ్ ఓ అద్భుత బంతితో ర‌చిన్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో ష‌మీ, అయ్య‌ర్‌లు ఊపిరిపీల్చుకున్నారు. జ‌ట్టు స్కోరు 69 ప‌రుగుల వ‌ద్ద ర‌చిన్ రెండో వికెట్‌గా ఔట్ అయ్యాడు.

IND vs NZ : వన్డేల్లో వరుసగా 15వ సారి టాస్ ఓడిపోయిన టీమ్ఇండియా.. బ్రియాన్ లారా ప్ర‌పంచ రికార్డును స‌మం చేసిన రోహిత్ శ‌ర్మ‌..

కాగా.. ర‌చిన్ ఔట్ కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.