Champions Trophy : అయ్యో పాపం రిష‌బ్ పంత్.. నిన్ను ఇలా చూస్తామ‌ని అనుకోలేదు.. వాట‌ర్ టిన్‌లు మోయ‌డం కోస‌మేనా..!

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ రిష‌బ్ పంత్ బెంచీకే ప‌రిమితం అయ్యాడు.

Champions Trophy : అయ్యో పాపం రిష‌బ్ పంత్.. నిన్ను ఇలా చూస్తామ‌ని అనుకోలేదు.. వాట‌ర్ టిన్‌లు మోయ‌డం కోస‌మేనా..!

Rishabh Pant is not play a single match in Champions Trophy 2025

Updated On : March 9, 2025 / 4:22 PM IST

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మ్యాచ్ స్వ‌రూపాన్ని ఒంటి చేత్తో మార్చే ఆట‌గాళ్ల‌లో అత‌డు ఒక‌డు. త‌మ జ‌ట్టులో పంత్ లాంటి ఆట‌గాడు ఉండాల‌ని కోరుకోని జ‌ట్టు ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదేమో.

కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్ర‌మాదానికి గురైన అత‌డు చాలా కాలం పాటు ఆట‌కు దూరం అయ్యాడు. ఐపీఎల్ 2024 ద్వారా పంత్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024ను టీమ్ఇండియా గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

IND vs NZ : వన్డేల్లో వరుసగా 15వ సారి టాస్ ఓడిపోయిన టీమ్ఇండియా.. బ్రియాన్ లారా ప్ర‌పంచ రికార్డును స‌మం చేసిన రోహిత్ శ‌ర్మ‌..

ఇక ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025కి ఎంపిక కావ‌డంతో ఈ మెగాటోర్నీలో కీల‌క మ్యాచ్‌లు ఆడ‌తాడ‌ని అంతా భావించారు. అయితే.. ఈ టోర్నీ మొత్తం అత‌డు బెంచీకే ప‌రిమితం అయ్యాడు. ఫైన‌ల్ స‌హా ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్‌లోనూ అత‌డికి ఆడే అవ‌కాశం రాలేదు.

వికెట్ కీప‌ర్‌గా సీనియ‌ర్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ వైపే టీమ్‌ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది. త‌న పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిజం చేస్తూ రాహుల్ సైతం మంచి ఇన్నింగ్స్‌లే ఆడ‌డంతో పంత్ బెంచీకే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది.

క‌నీసం ఫైన‌ల్ మ్యాచ్‌లోనైనా స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్‌గా తీసుకోవాల‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు సూచించినా అలా జ‌ర‌గ‌లేదు. జ‌ట్టులో అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వీంద్ర జ‌డేజా వంటి ఆల్‌రౌండ‌ర్లు ఉండ‌డంతో పంత్‌కు చోటు లేకుండా పోయింది.

IPL 2025 : ఐపీఎల్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్‌కు భారీ షాక్..

దీంతో అత‌డి ఫ్యాన్స్ నిరాశ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఒక్క మ్యాచ్‌లో కూడా పంత్ ను ఆడించక‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. వాట‌ర్ టిన్‌లు మోయ‌డానికే పంత్ తీసుకువెళ్లారా అని విమ‌ర్శిస్తున్నారు.