IND vs NZ : చేతులకి బటర్ పూసుకుని వచ్చారా..? నాలుగు క్యాచ్ లు డ్రాప్.. అది కూడా ఫైనల్లో.. ఎలా వదిలేశారో చూడండి..

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త ఫీల్డ‌ర్లు నాలుగు క్యాచ్‌ల‌ను జార‌విడిచారు.

IND vs NZ : చేతులకి బటర్ పూసుకుని వచ్చారా..? నాలుగు క్యాచ్ లు డ్రాప్.. అది కూడా ఫైనల్లో.. ఎలా వదిలేశారో చూడండి..

India drop 4 catches in the Champions Trophy 2025 final against New Zealand

Updated On : March 9, 2025 / 6:22 PM IST

క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి క్రికెట్ లో చాలా ప్ర‌సిద్ధి. అంటే దీని అర్థం క్యాచ్‌లు స‌రిగ్గా అందుకుంటేనే మ్యాచ్‌ల‌ను గెల‌వ‌వ‌చ్చు. ఒక్క క్యాచ్‌ను మిస్ చేసినా దాని ప్ర‌భావం మ్యాచ్ ఫలితం పై ప‌డుతుంది.

ఒక్క క్యాచ్ వ‌దిలివేసినా మ్యాచ్ ఓడిన‌పోయిన ఘ‌ట‌న‌ల‌ను ఎన్నో చూశాం. ఇక ఐసీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో అయితే.. ఫీల్డింగ్ ఎంత జాగ్ర‌త్త‌గా చేయాలి. ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోవ‌ద్దు. అప్పుడే విజేత‌గా నిలవ‌వ‌చ్చు. కానీ టీమ్ఇండియా ఫీల్డ‌ర్లు మాత్రం న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదిక‌గా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో మ్యాచ్‌లో ఒక‌టి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా నాలుగు క్యాచ్‌ల‌ను చేజార్చారు.

IND vs NZ : నేను అక్క‌డ ఉంటే ఇలా మిస్ చేసే వాడిని కాదు.. రిష‌బ్ పంత్ రియాక్ష‌న్ వైర‌ల్‌..

ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర ఇచ్చిన రెండు క్యాచ్‌ల‌ను అందుకోలేక‌పోయారు. ఓ క్యాచ్‌ త‌న సొంత బౌలింగ్‌లో ష‌మీ జార‌విడ‌చ‌గా మ‌రికాసేప‌టికే ర‌చిన్ ఇచ్చిన మ‌రో క్యాచ్‌ను శ్రేయ‌స్ అయ్య‌ర్ బౌండ‌రీ లైన్ వ‌ద్ద ప‌ట్టుకోలేక‌పోయాడు. హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగిన డారిల్ మిచెల్ ఇచ్చిన రోహిత్ శ‌ర్మ మిస్ చేశాడు. అయితే.. ఈ క్యాచ్ కాస్త క‌ష్ట‌మైన‌ది.

ఆ త‌రువాత గ్లెన్ ఫిలిప్స్ ఇచ్చిన క్యాచ్ ల‌డ్డూ లాంటి క్యాచ్‌ను శుభ్‌మ‌న్ గిల్ చేజార్చాడు. దీంతో టీమ్ఇండియా ఫీల్డింగ్ పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

IND vs NZ : కుల్దీప్ దెబ్బ‌కు ర‌చిన్ ర‌వీంద్ర ఫ్యూజులు ఔట్‌.. బాల్ ఎలా తిరిగిందో చూశారా.. వీడియో వైర‌ల్‌

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 251 ప‌రుగులు చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డారిల్ మిచెల్ (63; 101 బంతుల్లో 3 ఫోర్లు), బ్రాస్‌వెల్ (53 నాటౌట్‌; 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు హాఫ్ సెంచ‌రీలు చేశారు. ర‌చిన్ ర‌వీంద్ర (37; 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), గ్లెన్ ఫిలిప్స్ (34; 52 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) లు రాణించారు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌లు చెరో రెండు వికెట్లు, ర‌వీంద్ర జ‌డేజా, ష‌మీలు త‌లా ఓ వికెట్ తీశారు.