IND vs NZ : నేను అక్కడ ఉంటే ఇలా మిస్ చేసే వాడిని కాదు.. రిషబ్ పంత్ రియాక్షన్ వైరల్..
కేఎల్ రాహుల్ బంతిని మిస్ చేసిన తరువాత రిషబ్ పంత్ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.

Rishabh Pant reaction viral after KL rahul miss field in Champions Trophy 2025 final
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఓ బంతిని అందుకోవడంలో విఫలం అయ్యాడు. దీంతో డగౌట్‌లో కూర్చోని మ్యాచ్ చూస్తున్న రిషబ్ పంత్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌ను వరుణ్ చక్రవర్తి వేసేందుకు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతడికి ఇదే తొలి ఓవర్. క్రీజులో ఓపెనర్ విల్‌యంగ్ (15) ఉన్నాడు.
Reaction of Rishabh Pant when KL Rahul missed a ball that goes for 5 run😶#INDvsNZ pic.twitter.com/6EOJftixFl
— Ajeet Kumar (@ajeetkr03) March 9, 2025
తొలి బంతిని డౌన్ ద లెగ్‌గా వేశాడు వరుణ్. విల్ యంగ్ వికెట్ కీపర్ వెనుక వైపుగా షాట్ ఆడాలని ప్రయత్నించాడు. బంతిని అతడు మిస్ అయ్యాడు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సైతం బంతిని అందుకోలేక పోయాడు. బంతి బౌండరీకి వెళ్లింది. ఆ బాల్ వైడ్ కాగా.. బంతి బౌండరీకి వెళ్లడంతో న్యూజిలాండ్‌కు ఎక్స్‌ట్రాల రూపంలో ఐదు పరుగులు వచ్చాయి.
డగౌట్‌లో కూర్చోని కేఎల్ రాహుల్ బాల్‌ను మిస్ చేయడాన్ని చూసిన పంత్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నేను అక్కడ ఉంటే ఆ బాల్ మిస్ అయ్యుండేది కాదని పంత్ అనుకుని ఉంటాడని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక రిషబ్ పంత్‌కు ఫైనల్ మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌లోనూ పంత్ కు ఆడే అవకాశం రాలేదు. కేవలం మైదానంలోని ఆటగాళ్లకు వాటర్ బాటిళ్లను అందించాడు.
ICC should introduce an award for best waterboy of the tournament, Rishabh Pant really deserves to win it.
He has been excellent at serving water & his dedication took another level when we seen him serving water to players in practice sessions❤️ pic.twitter.com/ykeYTf4Y0y
— Rajiv (@Rajiv1841) March 9, 2025