షూటింగ్‌లో ఇండియా జయహో: గురి పెట్టి కొడితే గోల్డ్ మెడల్ వచ్చింది

షూటింగ్‌లో ఇండియా జయహో: గురి పెట్టి కొడితే గోల్డ్ మెడల్ వచ్చింది

Updated On : February 23, 2019 / 10:43 AM IST

ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2019లో భాగంగా జరిగిన పోటీల్లో అపూర్వి చండేలా షూటింగ్‌లో గోల్డ్ కొట్టేసింది. 10మీ మహిళా ఎయిర్ రైఫిల్ ఫినాలేలో 26ఏళ్ల చండేలా 252.9 షాట్‌ను కొట్టేసి స్వర్ణాన్ని పట్టేసింది. ప్రపంచ కప్ టోర్నీ న్యూ ఢిల్లీలోని కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్  వేదికగా జరుగుతోంది. 

ఫైనల్ రౌండ్‌లో 634 పాయింట్లతో గతంలో వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన చైనా ప్లేయర్ జో రోజుతో హోరాహోరీగా తలపడింది. టూ షాట్ సిరీస్‌లో చండేలా 10.6, 10.8 షాట్‌లు కొట్టి టాప్ ప్రైజ్ పట్టేసింది. దీంతో రోజుకు సిల్వర్ దక్కినట్లు అయింది. ఆరంభంలో చండేలాకు గట్టి పోటీనిచ్చిన చైనా ప్లేయర్ గ్సూ హాంగ్ బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది.
Read Also: వైజాగ్‌‌కు క్రికెట్ ఫీవర్ : ఆసీస్‌-భారత్‌ ఫస్ట్ టీ20 ఫైట్

ఈ ఈవెంట్‌లో భారత్ చాలా తక్కువ కేటగిరీల్లో పాల్గొంటుంది. చండేలా, అంజుమ్‌లు ఎక్కువ కోటాల్లోనే బరిలోకి దిగినప్పటికీ వారు ఈ ఒక్క పతకమే గెలుచుకోవడమనేది చాలా తక్కువ. కానీ, 10మీ మహిళా ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో అర్హత సాధించిన ఏకైక మహిళ చండేలా కావడం విశేషం. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 629.3 పాయింట్లు సాధించిన చండేలా నాలుగో స్థానంతో ముగించింది.
Read Also: పంత్ వార్నింగ్: మహీ భాయ్ రెడీగా ఉండు..