James Anderson: ఇందుకే జేమ్స్ ఆండర్సన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎక్కువ.. 5 కారణాలు

టెస్టుల్లో భారత్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక మ్యాచులు (200 మ్యాచులు) ఆడారు. ఆ తర్వాత..

James Anderson: ఇందుకే జేమ్స్ ఆండర్సన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎక్కువ.. 5 కారణాలు

James Anderson (cricketer)

James Anderson- HBD: ప్రపంచ దిగ్గజ బౌలర్లలో ఇంగ్లండ్ (England) పేసర్ జేమ్స్ అండర్సన్ ఒకరు. ఇవాళ ఆయన 41వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎక్కువే. టీ20 ప్రపంచ కప్‌-2010 (ICC T20 World Cup- 2010)ను గెలిచిన ఇంగ్లండ్ జట్టులో ఆయన ఒకరు.

అన్ని ఫార్మాట్లలో కలిపి ఆండర్సన్ 396 అంతర్జాతీయ మ్యాచులు ఆడి 27.22 యావరేజ్ తో 977 వికెట్లు తీశారు. ఆయన ఉత్తమ బౌలింగ్ 7/42. కెరీర్ మొత్తం కలిపి ఆయన 34 సార్లు అయిదేసి వికెట్ల పడగొట్టారు. అలాగే, మూడుసార్లు పదికి పది వికెట్ల తీశారు.

టెస్టుల్లో..
టెస్టుల్లో 183 మ్యాచులు ఆడిన ఆండర్సన్ మొత్తం 690 వికెట్లు పడగొట్టారు. ఉత్తమ బౌలింగ్ 7/42.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరణ్ (800 వికెట్లు), ఆసీస్ బౌలర్ షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాత మూడో స్థానంలో ఆండర్సన్ ఉన్నారు.
టెస్టుల్లో భారత్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక మ్యాచులు (200 మ్యాచులు) ఆడారు. ఆ తర్వాత అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెటర్ ఆండర్సన్ (183 మ్యాచులు)

వన్డేల్లో..
వన్డేల్లో 194 మ్యాచులు ఆడిన ఆండర్సన్ మొత్తం 269 వికెట్లు తీశారు. ఉత్తమ బౌలింగ్ 5/23

టీ20ల్లో..
ఆండర్సన్ 19 టీ20 మ్యాచుల్లోనూ ఆడారు. టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టారు. ఉత్తమ బౌలింగ్ 3/23

MS Dhoni : దొంగచాటుగా ధోని వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్.. ఫ్యాన్స్ ఫైర్‌.. ఇలా చేయ‌డం ఏం బాలేదు