Jos Buttler : టీ20 క్రికెట్‌లో జోస్ బట్లర్ అరుదైన ఘనత.. ప్రపంచ క్రికెట్‌లో ఏడో ఆటగాడు ఇతడే..
టీ20 క్రికెట్‌లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు

Jos Buttler became the seventh batsman to complete 13000 runs in T20
టీ20 క్రికెట్‌లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో 13 వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో భాగంగా యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న బట్లర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్ 46 బంతులను ఎదుర్కొన్నాడు. 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలో బట్లర్ టీ20 ఫార్మాట్‌లో 13వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఇంగ్లాండ్ ఆటగాడిగా నిలిచాడు. అతడి కంటే ముందు అలెక్స్ హేల్స్ (503 మ్యాచ్‌ల్లో 13814పరుగులు) ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఏడో ప్లేయర్‌గా బట్లర్ నిలిచాడు. గేల్, పొలార్డ్, హేల్స్, మాలిక్, కోహ్లీ, వార్నర్‌లు లు బట్లర్ కన్నా ముందే ఈ మైలురాయిని చేరుకున్నారు.
Luke Hollman : ఇదెక్కడి షాట్ రా అయ్యా.. దీనికి ఏం పేరు పెట్టాలో కాస్త చూసి చెప్పండి బాబులు..
టీ20ల్లో 13వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు వీరే..
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 14562 పరుగులు
కీరన్ పోలార్డ్ (వెస్టిండీస్) – 13854 పరుగులు
అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్) – 13814 పరుగులు
షోయబ్ మాలిక్ (పాకిస్థాన్) – 13571 పరుగులు
విరాట్ కోహ్లీ (భారత్) – 13543 పరుగులు
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 13395 పరుగులు
జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) – 13046 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తూ.. బట్లర్ వీర విహారంతో తొలుత బ్యాటింగ్ చేసిన లాంకాషైర్ 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. బట్లర్‌తో పాటు ఫిల్ సాల్ట్ (29 బంతుల్లో 42 పరుగులు) రాణించాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో యార్క్‌షైర్ తడబడింది. 19.1 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది. దీంతో లాంకాషైర్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది.