Ranchi : రాంచీ స్టేడియం వద్ద తొక్కిసలాట.. ఆరోగ్య శాఖ మంత్రి ఏమన్నారంటే?
Ranchi : రాంచీలోని జేఎస్సీఏ (JSCA) స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది.
JPL final stampede at jsca stadium ranchi three seriously injured
Ranchi : రాంచీలోని జేఎస్సీఏ (JSCA) స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. మంగళవారం జార్ఖండ్ ప్రీమియర్ లీగ్ (JPL) ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడగా ఓ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది అభిమానులు మ్యాచ్ చూసేందుకు రావడంతో వెస్ట్ గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు చెప్పారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం…మ్యాచ్ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం పశ్చిమ గేటు వద్ద భారీగా జనసందోహం ఏర్పడింది. గేటు వద్ద భద్రతా తనిఖీలు చాలానెమ్మదిగా సాగడంతో వేచి ఉన్న అభిమానులు తీవ్ర అసహనానికి గురి అయ్యారు. ఈ క్రమంలో కొందరు ముందుకు దూసుకువెళ్లడంతో పరిస్థితి అదుపుతప్పింది. గేటుతో పాటు బారికేడ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
IPL : ట్రేడ్ డీల్ కంప్లీట్.. రిషబ్ పంత్ జీతంలో 12 కోట్లు కోత.. కుల్దీప్ యాదవ్ పై సానుభూతి
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరిన తరువాత మ్యాచ్ను యథావిధిగా నిర్వహించారు.
కాగా.. ఈ భద్రతా వైఫల్యానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు జిల్లా పరిపాలన అధికారిక విచారణను ప్రారంభించింది. ఘటన అనంతరం స్టేడియంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
#WATCH | Jharkhand: A stampede-like situation arose at the JSCA Stadium in Ranchi during the final match of the Jharkhand T20 League due to an unexpectedly large crowd. More details awaited
Jharkhand Health Minister Irfan Ansari says- Hospitals have also been alerted for the… pic.twitter.com/CqlfHjTrC3
— ANI (@ANI) June 23, 2026
గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్పందించిన ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ
ఈ ఘటనపై ఝార్ఖండ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ స్పందించారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
జార్ఖండ్ ప్రీమియర్ లీగ్ (JPL) ఫైనల్ టీ20 మ్యాచ్ సందర్భంగా కొంతమంది గాయపడినట్లు సమాచారం అందగానే ఆరోగ్య శాఖను వెంటనే అప్రమత్తం చేశాను. సివిల్ సర్జన్, సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశాము. అంబులెన్సులు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. గాయపడిన ప్రతి ఒక్కరికీ తక్షణ వైద్య సహాయం అందిస్తున్నాము. అని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు.
Manika Batra : అందంతో చంపేస్తున్న టేబుల్ టెన్నిస్ భామ.. మనికా బాత్రా క్యూట్ ఫోటోలు వైరల్
ఈ ఘటనతో మరోసారి స్టేడియాల్లో భద్రతా ప్రమాణాలు, జనసమూహ నియంత్రణ, టికెట్ నిర్వహణ, ప్రేక్షకుల భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. స్థానిక క్రీడాభిమానులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
