గుజరాత్‌ టైటాన్స్‌ తనను ఎందుకు వెళ్లగొట్టిందో చెప్పిన రబాడ.. బుద్ధొచ్చింది.. ఇంకెప్పుడూ అలా చేయను..

ఈ మేరకు పూర్తి వివరాలు చెప్పాడు.

గుజరాత్‌ టైటాన్స్‌ తనను ఎందుకు వెళ్లగొట్టిందో చెప్పిన రబాడ.. బుద్ధొచ్చింది.. ఇంకెప్పుడూ అలా చేయను..

Updated On : May 3, 2025 / 7:53 PM IST

గుజ‌రాత్ టైటాన్స్‌ స్టార్ పేస‌ర్, సౌతాఫ్రికా ఆటగాడు కగిసో రబాడ సరిగ్గా నెల రోజు క్రితం ఐపీఎల్‌ 2025ను వీడి త‌న స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో గుజ‌రాత్ టైటాన్స్ మేనెజ్‌మెంట్ ఓ ప్ర‌క‌ట‌న‌ చేస్తూ.. అతడు వ్యక్తిగత కారణాల‌ వల్లే సౌతాఫ్రికాకు వెళ్లాడని చెప్పింది.

అయితే, ఇవాళ రబాడ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. తనపై విధించిన తాత్కాలిక సస్పెన్షన్ కారణంగా తాను ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు. తాను మాదక ద్రవ్యాలను వాడినందుకు తనపై ఆ సస్పెన్షన్ విధించారని కూడా చెప్పాడు.

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటున్నారా?

తప్పులను సరిద్దుకునేందుకు తనకు వచ్చిన ఓ అవకాశంగా ఈ పరిస్థితులను ఉపయోగించుకుంటానని రబాడ తెలిపాడు. తనను క్షమించాలని కోరాడు. తాను ఏ మాదక ద్రవ్యాన్ని వాడానన్న వివరాలను రబాడ చెప్పలేదు. అలాగే, టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో తనకు డ్రగ్స్‌ టెస్ట్ చేశారా? లేదా ప్రాక్టీస్‌ మ్యాచులు ఆడుతున్న వేళ చేశారా? అన్న వివరాలను కూడా అతడు వివరించలేదు.

రబాడ తన స్టేట్‌మెంట్‌లో ఏమన్నాడు?
“నేను ఐపీఎల్‌లో ఆడకుండా వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి దక్షిణాఫ్రికాకు వచ్చానని ఇప్పటికే ఓ ప్రకటన వచ్చింది. అయితే, ఆ సమయంలో నేను మాదక దవ్యాలను వాడానని టెస్టులో తెలిసిపోయింది. అందుకే నేను దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. నేను నా చర్యలతో అంతమందిని నిరాశపర్చినందుకు చాలా బాధపడుతున్నాను.

క్రికెట్ ఆడటమంటే ఎంత స్పషలో, ఎంత ముఖ్యమో నాకు ఇప్పుడు అర్థమైంది. క్రికెట్‌లో ఆడాల్సింది నా లక్ష్యాలను సాధించడం కోసమే కాదు.. ఇది పెద్ద బాధ్యత, నాకు దక్కే గౌరవం. ఇప్పుడు నేను తాత్కాలిక నిషేధాన్ని ఎదుర్కొంటున్నాను. నేను బాగా ఇష్టపడే క్రికెట్లో మళ్లీ ఆడతానని ఆశిస్తున్నాను” అని రబాడ అన్నాడు.