Kane Williamson : మూడోసారి తండ్రైన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్.. చిన్నారి ఫొటో చూశారా!
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రయ్యాడు. అతని భార్య సారా రహీమ్ బుధవారం మూడో సంతానంలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

Kane Williamson
Kane Williamson Wife : న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రయ్యాడు. అతని భార్య సారా రహీమ్ బుధవారం మూడో సంతానంలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే వారిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2020లో కుమార్తె జన్మించగా.. 2022లో మగ బిడ్డకు సారా జన్మనిచ్చింది. తాజాగా మూడో సంతానంలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. విలియమ్సన్ తన మూడో బిడ్డ, భార్య సారాతో కలిసి ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. మూడోసారి తండ్రి అయినట్లు అభిమానులకు తెలియజేశారు. తన కుమార్తె ప్రపంచంలోకి సురక్షితంగా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కేన్ విలియమ్సన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో.. ‘ఆపై మూడు.. ప్రపంచ అందమైన అమ్మాయికి స్వాగతం. మీ సురక్షితమైన రాక మరియు ముందుకు సాగిన ఉత్తేజకరమైన ప్రయాణానికి కృతజ్ఞతలు’ అని రాశాడు. కేన్ విలియమ్సన్, సారా రహీం 2015 నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ జంట ఇంకా వివాహం చేసుకోలేదు. విలియమ్సన్ తరచూ కుటుంబ సభ్యులతో ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.
Also Read : Jan Nicol Loftie Eaton : టీ20 క్రికెట్‌లో పెను విధ్వంసం.. చరిత్ర సృష్టించిన నమీబియా ఆటగాడు
న్యూజిలాండ్ ప్లేయర్ విలియమ్సన్ చివరిగా దక్షిణాప్రికాతో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఆడాడు. అనేక రికార్డులను నమోదు చేశాడు. మాజీ టెస్టు కెప్టెన్ టెస్ట్ ఫార్మాట్ లో అత్యంత వేగంగా 32 సెంచరీలు చేసిన ప్లేయర్ గా అగ్రస్థానంలో నిలిచాడు. కేన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడనున్నాడు. అతను గత సీజన్ లో గాయపడి చాలాకాలం పాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే.
View this post on Instagram