బాల్ త‌గిలి.. గ్రౌండ్ లో కుప్పకూలిన లంక క్రికెట‌ర్‌

  • Publish Date - February 2, 2019 / 06:54 AM IST

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో శ్రీలంక క్రికెట‌ర్ దిముత్ క‌రుణ‌ర‌త్నే గాయ‌ప‌డ్డాడు. ప్యాట్ క‌మ్మిన్స్ వేసిన స్పీడ్ బంతి నేరుగా బ్యాట్స్‌మెన్‌ క‌రుణ‌ర‌త్నే మెడ‌కు బ‌లంగా త‌గిలింది. 142 కిలోమీట‌ర్ల వేగంతో వ‌చ్చిన బంతి మెడ‌కు త‌గ‌ల‌డంతో క‌రుణ‌ర‌త్నే అక్క‌డే ప‌డిపోయాడు. 

దీంతో ఆసీస్‌, లంక డాక్ట‌ర్లు అతనికి ప్ర‌థ‌మ చికిత్స అందించారు. బంతి త‌గిలిన త‌ర్వాత నొప్పి ఎక్కువ‌గా ఉంద‌ని, ఎడమ చేతి న‌రాలు కూడా లాగుతున్న‌ట్లు క‌రుణ‌ర‌త్నే డాక్ట‌ర్లకు చెప్పాడు. ఫీల్డ్ నుంచి స్ట్రెచ‌ర్ పై బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి చికిత్స కోసం అత‌న్ని దగ్గరలో ఉన్న హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. క‌రుణ‌ర‌త్నే 84 బంతుల్లో 46 ర‌న్స్ చేసి రిటైర్డ్‌ హార్ట్‌గా తిరిగి వెళ్లాడు.

అత‌ని స్థానంలో కెప్టెన్ దినేష్ చండీమాల్ బ్యాటింగ్‌కు దిగాడు. మొదటి టెస్ట్  ఆస్ట్రేలియా ఒక ఇన్నింగ్స్ మరియు 40 పరుగుల తేడాతో గెలిచింది. రెండవ టెస్ట్: ఫిబ్రవరి 1-5, కాన్బెర్రా.