Pro Panja League : జూలై 28 నుంచి ప్రో పంజా లీగ్.. కిరాక్ హైద‌రాబాద్ ఆట‌గాళ్లు వీరే

ప్రో పంజా లీగ్ తొలి సీజ‌న్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. జూలై 28 నుంచి ఆగ‌స్టు 13 వ‌ర‌కు ఢిల్లీలోని ఐజిఐ స్టేడియంలో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Pro Panja League : జూలై 28 నుంచి ప్రో పంజా లీగ్.. కిరాక్ హైద‌రాబాద్ ఆట‌గాళ్లు వీరే

Kiraak Hyderabad

Updated On : July 11, 2023 / 7:40 PM IST

Pro Panja League : ప్రో పంజా లీగ్ తొలి సీజ‌న్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. జూలై 28 నుంచి ఆగ‌స్టు 13 వ‌ర‌కు ఢిల్లీలోని ఐజిఐ స్టేడియంలో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ లీగ్ బ‌రిలో హైద‌రాబాద్ ప్రాంచైజీ నిలిచింది. కిరాక్ హైద‌రాబాద్ (Kiraak Hyderabad) పేరుతో పాల్గొన‌నుంది. మెరిడియన్ హోటల్‌లో జరిగిన ప్లేయర్స్ డ్రాఫ్ట్‌లో 180 మంది ఆటగాళ్లను ఆరు జట్లు ఎంచుకున్నాయి. హైదరాబాద్ జట్టు 10 విభాగాల్లో మొత్తం 30 మంది ఆటగాళ్లను తీసుకుంది.

MS Dhoni : సీఎస్‌కేలో చోటు కోరిన‌ క‌మెడియ‌న్.. ధోని రియాక్ష‌న్ వైర‌ల్‌

తొలి సీజ‌న్ ప్రారంభానికి ముందు ప్రో పంజా లీగ్‌కు వ‌స్తున్న స్పంద‌న‌ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంద‌ని ప్రో పంజా లీగ్ సహ వ్యవస్థాపకుడు పర్విన్ దాబాస్ అన్నారు. జ‌ట్లు అన్ని ఖ‌రారు అయ్యాయి. బ‌రిలోకి దిగేందుకు ఆట‌గాళ్లంతా సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. అథ్లెట్లు త‌మ ప్ర‌తిభ‌ను చూపించేందుకు స‌రైన వేదిక కోసం సంవ‌త్సార‌లుగా ఎదురుచూశార‌ని, జూలై 28 నుంచి ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు అథ్లెట్ల స‌త్తా చూడ‌గ‌ల‌ర‌ని ప్రో పంజా లీగ్ సహ వ్యవస్థాపకురాలు ప్రీతీ ఝాంగియాని తెలిపారు.

Pro Panja League

Pro Panja League

కిరాక్ హైదరాబాద్ యజమాని గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ లీగ్ ను ముందుకు తీసుకెళ్లడానికి మేము నిజంగా సంతోషిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ప్రీతి ఝాంగియాని, పర్విన్ దాబాస్‌లకు ధన్యవాదాలు తెలియ‌జేశారు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఉన్నామ‌ని, లీగ్‌లో ముందుకు వెలుతున్న కొద్ది నేర్చుకుంటామ‌న్నారు. 60 కిలోలు, 70 కిలోలు, 90 కిలోల విభాగంలో అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకున్నాము. మాకు మంచి బ్యాలెన్స్ తో కూడిన టీమ్ ఉందని ఖచ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. మా ఆటగాళ్ళు తమ ఉత్తమ ప్రదర్శన ఇస్తారు అని గౌతమ్ రెడ్డి అన్నారు.

Virat Kohli : విరాట్ కోహ్లి ముంగిట అత్యంత అరుదైన రికార్డు.. విండీస్ తుది జ‌ట్టులో ఆ వ్య‌క్తి చోటు ద‌క్కించుకుంటేనే..!

హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ ఫైజాన్ అలీని హైదరాబాద్ ఫ్రాంచైజీ తీసుకుంది. సొంత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డం గొప్ప అనుభూతి అని అలీ అన్నాడు. ఇందుకు హైద‌రాబాద్ మేనేజ్‌మెంట్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. లీగ్‌లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు కృషి చేస్తాన‌ని అన్నాడు.

 

Kiraak Hyderabad Players list

Kiraak Hyderabad Players list