KKR : ఢిల్లీని చిత్తు చేసిన ఆనందంలో కేకేఆర్‌.. భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. పేస‌ర్ పై మ్యాచ్ నిషేదం

ఢిల్లీని చిత్తు చేసిన ఆనందంలో ఉన్న కేకేఆర్ జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది.

Kolkata Knight Riders : ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఢిల్లీని చిత్తు చేసిన ఆనందంలో ఉన్న కేకేఆర్ జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు పేస‌ర్ హ‌ర్షిత్ రాణా ఓ మ్యాచ్ ఆడ‌కుండా నిషేదాన్ని విధించింది బీసీసీఐ. అంతేనా అత‌డి మ్యాచ్ ఫీజులో 100 శాతం జ‌రిమానా విధించింది.

ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించాడు. ఈ సీజ‌న్‌లో అత‌డు రెండోసారి ఐపీఎల్ రూల్స్ బ్రేక్ చేయ‌డంతో మ్యాచ్ నిషేదాన్ని ఎదుర్కొంటున్నాడు. కాగా.. ఈ సీజ‌న్‌లో ఐపీఎల్ మ్యాచ్ నిషేదానికి గురైన మొద‌టి ఆట‌గాడు హ‌ర్షిత్ రాణానే కావ‌డం గ‌మ‌నార్హం.

Team India : ఐపీఎల్ ఫామ్ ఆధారంగానే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌?

ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో రాణా మంచి ప్ర‌ద‌ర్శ‌న‌నే చేశాడు. నాలుగు ఓవ‌ర్లు వేసి 28 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కాగా..ఇన్నింగ్స్ ఏడో ఓవ‌ర్‌లో అభిషేక్ పోరెల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. వికెట్ తీసిన ఆనందంలో అత‌డు పోరెల్‌కు ఫ్లైయింగ్ కిస్‌ను ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించి త‌రువాత డ‌గౌట్ వైపు చేతిని సైగ చేశాడు.

ఈ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదార‌బాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌యాంక్ అగ‌ర్వాల్‌ను ఔట్ చేసిన త‌రువాత ఫ్ల‌యింగ్ కిస్ ఇస్తూ అత‌డిని రెచ్చ‌గొట్టాడు. దీంతో రాణా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించ‌డంతో పాటు గ‌ట్టిగా మంద‌లించారు. తాజాగా ఢిల్లీతో మ్యాచ్‌లోనూ దాదాపుగా అలాంటిదే చేయ‌డంతో బీసీసీఐ అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 153 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ (35నాటౌట్; 26 బంతుల్లో) ఒక్క‌డే రాణించాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. వ‌రుణ్ అరోరా రెండు, హ‌ర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్‌, సునీల్ న‌రైన్ ఒక్కొ వికెట్ సాధించారు. ఈ ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఈ ల‌క్ష్యాన్ని 16.3 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ (68; 33 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచ‌రీ సాధించాడు.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. మార్క్ర‌మ్ సార‌థ్యంలో డేంజ‌రెస్‌గా సౌతాఫ్రికా..

 

ట్రెండింగ్ వార్తలు