ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడుతోన్న కోల్‌కతా వర్సెస్ చెన్నై పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ పరవాలేదనిపించే స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు 162 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కొద్దిపాటి విరామం తర్వాత జట్టులోకి చేరిన ఓపెనర్ క్రిస్ లిన్(82; 51 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులు)తో మొత్తం స్కోరులో సగానికి పైగా బాదేశాడు.
మిగిలిన బ్యాట్స్‌మెన్ అంత స్కోరు నమోదు చేయలేకపోయినా.. క్రిస్ లిన్‌కు తోడ్పాటును అందిస్తూ ముందుకు నడిచారు. ఈ క్రమంలో సునీల్ నరైన్(2), నితీశ్ రానా(21), రాబిన్ ఊతప్ప(0), దినేశ్ కార్తీక్(18), ఆండ్రీ రస్సెల్(10), శుభ్‌మాన్ గిల్(15), పీయూశ్ చావ్లా(4), కుల్దీప్ యాదవ్(0) పరుగులతో సరిపెట్టుకున్నారు.
చెన్నై బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ ఒక్కడే 4వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్(2), మిచెల్ శాంతర్(1) దక్కించుకున్నారు.