KKRvsRCB: కోహ్లీ సెంచరీ, కోల్‌‌కతా టార్గెట్ 214

కోల్‌‌కతాపై బెంగళూరు విజృంభించింది. ఐపీఎల్ సీజన్ 12లో తొలిసారి మెరుపులు సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 4 వికెట్లు నష్టపోయి కోల్‌‌కతాకు 214 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది.

బెంగళూరు జట్టు స్కోరులో కోహ్లీ(100; 58 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సులు), మొయిన్ అలీ(66; 28 బంతుల్లో 5 ఫోర్లు, 6సిక్సులు)తో విజృంభించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మరో ఓపెనర్ పార్థివ్ పటేల్(11), అక్షదీప్ నాథ్(13), మార్కస్ స్టోనిస్(17)పరుగులు చేశారు. 

హ్యారీ గన్రీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.