KL Rahul becomes fifth India batter to hit 300 T20 sixes
KL Rahul hit 300 T20 sixes : లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 మ్యాచుల్లో 300 సిక్సర్లు బాదిన ఐదో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదడంతో 300 సిక్సర్ల క్లబ్‌లో రాహుల్ అడుగుపెట్టాడు. 218 టీ20 మ్యాచుల్లో 300 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు.
టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఏకంగా 497 సిక్సర్లు బాదాడు. ఆ తరువాత వరుసగా విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సురేశ్ రైనాలు ఉన్నారు.
KKR vs LSG : కేకేఆర్ ఫీల్డర్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన లక్నో బ్యాటర్..
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు..
రోహిత్ శర్మ – 431 మ్యాచుల్లో 497 సిక్సర్లు
విరాట్ కోహ్లి – 382 మ్యాచుల్లో 383 సిక్సర్లు
ఎంఎస్ ధోని – 382 మ్యాచుల్లో 328 సిక్సర్లు
సురేశ్ రైనా – 336 మ్యాచుల్లో 325 సిక్సర్లు
కేఎల్ రాహుల్ – 218 మ్యాచుల్లో 300 సిక్సర్లు
టీ20ల్లో రాహుల్ కొట్టిన 300 సిక్సర్లలో 178 సిక్సర్లు ఐపీఎల్‌లో, టీమ్ఇండియా తరుపున 72 మ్యాచుల్లో 99 సిక్సర్లు బాదాడు. కర్ణాటక తరుపున 23 సిక్సర్లు కొట్టాడు.
Preity Zinta : ‘గెలిచాం.. గెలిచాం.. అయ్యో ఓడిపోయామే..’ ప్రీతీ జింటా ఎక్స్‌ప్రెషన్స్ వైరల్
ఇదిలా ఉంటే.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మొత్తంగా 27 బంతుల్లో ఎదుర్కొని 3ఫోర్లు, 2 సిక్సర్లు బాది 39 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ (45; 32 బంతుల్లో 2 ఫోర్లు, 4సిక్సర్లు) సైతం రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
Indians with 300 T20 sixes: Rohit Sharma, Virat Kohli, MS Dhoni, Suresh Raina, KL RAHUL ??♀️ pic.twitter.com/EW20Wxv8uo
— Lucknow Super Giants (@LucknowIPL) April 14, 2024