KKR vs LSG : కేకేఆర్ ఫీల్డర్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన లక్నో బ్యాటర్..
కేకేఆర్ ఫీల్డర్ రమణ్‌దీప్ సింగ్ గాల్లో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

Screengrab from video posted on x by@IPL
KKR vs LSG : ఐపీఎల్ 2024 సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కళ్లు చెదిరే క్యాచులు పడుతూ అభిమానులను అలరిస్తున్నారు ఫీల్డర్లు. తాజాగా కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లోనూ ఓ అద్భుతమైన క్యాచ్ నమోదైంది. కేకేఆర్ ఫీల్డర్ రమణ్‌దీప్ సింగ్ గాల్లో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో లక్నో బ్యాటర్ దీపక్ హుడా పాయింట్ దిశగా షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రమణ్‌దీప్ సింగ్ తన కుడి చేతి వైపు గాల్లోనే పూర్తిస్థాయిలో డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. ప్రేక్షకులు, కామెంటేటర్లు ఆశ్చర్యపోగా దీపక్ హుడా బిత్తరపోయాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నువ్వు మనిషివా.. పక్షివా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Preity Zinta : ‘గెలిచాం.. గెలిచాం.. అయ్యో ఓడిపోయామే..’ ప్రీతీ జింటా ఎక్స్‌ప్రెషన్స్ వైరల్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 161 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (45; 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (39; 27 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Ramandeep can FLY! ✈️
That was one stunning grab! ? ?#LSG 49/2 after the Powerplay
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia ??#TATAIPL | #KKRvLSG | @KKRiders pic.twitter.com/jiaAGEXt31
— IndianPremierLeague (@IPL) April 14, 2024