ENG vs IND : తొలి టెస్టు ఆఖ‌రి రోజు ఆట‌పై కేఎల్ రాహుల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

నాలుగో రోజు మ్యాచ్ అనంత‌రం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

KL Rahul comments viral after day 4 of ENG vs IND first test match

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య హెడింగ్లీ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా మారింది. భార‌త జ‌ట్టు ఇంగ్లాండ్ ముందు 371 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లాండ్ వికెట్ న‌ష్ట‌పోకుండా 21 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ గెల‌వాలంటే ఆఖ‌రి రోజు మ‌రో 350 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా, భార‌త్ 10 వికెట్లు తీస్తే గెలుస్తుంది.

కాగా.. ఈ మ్యాచ్‌లో ఖ‌చ్చితంగా ఫ‌లితం వ‌స్తుంద‌ని, డ్రా అయ్యే ఛాన్సులు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ తెలిపాడు. ఆఖ‌రి రోజు ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసేందుకు శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నం చేస్తామ‌ని చెప్పుకొచ్చాడు.

Ishan Kishan : పాక్ ఆట‌గాడితో ఇషాన్ కిష‌న్ సంబురాలు.. వీడియో వైర‌ల్‌..

నాలుగో రోజు మ్యాచ్ అనంత‌రం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. తొలి టెస్టు మ్యాచ్‌కు బ్లాక్ బాస్ట‌ర్ ముగింపు ఉంటుంద‌ని చెప్పాడు. ‘ఈ మ్యాచ్‌లో ఖ‌చ్చితంగా ఫ‌లితం వ‌స్తుంది. ఇంగ్లాండ్ జ‌ట్టు కూడా డ్రా కోసం కాకుండా విజ‌యం కోసం ప్ర‌య‌త్నిస్తుంది. ఈ విష‌యాన్ని వారు ఇప్ప‌టికే చెప్పారు. వాళ్లు దూకుడుగా ఆడితే మా బౌల‌ర్లు 10 వికెట్లు తీసి భార‌త్‌కు విజ‌యాన్ని అందిస్తారు.’ అని రాహుల్ అన్నాడు.

జ‌ట్టులో త‌న‌కు విభిన్న బాధ్య‌త‌లు, పాత్ర‌లు ఇవ్వ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నాడు. త‌న‌కు స‌రిపోయే బ్యాటింగ్ ఆర్డ‌ర్ ఏంటో తిరిగి తెలుసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంద‌న్నాడు.

ENG vs IND : చ‌రిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. 93 ఏళ్ల భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారి ఇలా..

మ్యాచ్ స్కోరు వివ‌రాలు..
భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్ – 471 ఆలౌట్‌
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ – 465 ఆలౌట్‌
భార‌త్ రెండో ఇన్నింగ్స్ – 364 ఆలౌట్‌