KL Rahul : ముకేశ్ అంబానీ ఇంట కేఎల్ రాహుల్ జంట‌.. వీడియో వైర‌ల్‌

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ (KL Rahul) త‌న భార్య అతియా శెట్టి (Athiya Shetty) తో క‌లిసి ముంబైలోని ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నివాసం యాంటిలియా(Antilia) కి వెళ్లారు

KL Rahul : ముకేశ్ అంబానీ ఇంట కేఎల్ రాహుల్ జంట‌.. వీడియో వైర‌ల్‌

KL Rahul-Athiya Shetty

KL Rahul-Athiya Shetty : ఆసియా క‌ప్ అనంత‌రం ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌కు ముందు టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌కు స్వ‌ల్ప విరామం దొర‌కింది. దీంతో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ (KL Rahul) త‌న భార్య అతియా శెట్టి (Athiya Shetty) తో క‌లిసి ముంబైలోని ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నివాసం యాంటిలియా(Antilia) కి వెళ్లారు. యాంటిలియాలో నిర్వ‌హించిన గ‌ణేష్ చ‌తుర్థి వేడుక‌ల్లో రాహుల్ దంప‌తులు పాల్గొన్నారు. రాహుల్ వైట్‌కుర్తా, పైజామా ధ‌రించగా, అత‌డి భార్య అతియా శెట్టి ఎరుపు రంగు చీర‌లో మెరిసిపోయింది.

అంబానీ నివాసానికి వచ్చిన తర్వాత రాహుల్, అతియాలు కలిసి కెమెరాలకు పోజులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి అన్న సంగ‌తి తెలిసిందే. రాహుల్, అతియా శెట్టిలు కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 23న ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం జ‌రిగింది.

రీ ఎంట్రీలో అద‌ర‌గొట్టిన రాహుల్‌..

ఐపీఎల్‌లో తొడ కండ‌రాల గాయంతో టోర్నీ మధ్య‌లోనే వైదొలిగాడు రాహుల్. గాయం కార‌ణంగా కొన్ని నెల‌ల పాటు టీమ్ఇండియాకు దూరంగా ఉన్నాడు. శ‌స్త్ర చికిత్స అనంత‌రం కోలుకుని బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో ఫిట్‌నెస్ సాధించాడు. అనంత‌రం ఆసియాక‌ప్ 2023తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. పూర్తి ఫిట్‌నెస్ లేక‌పోవ‌డంతో మొద‌టి రెండు మ్యాచుల‌కు దూరం అయ్యాడు.

Asia Cup 2023: కోహ్లీ అభిమానిగా మారిన శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగే..! ఇన్‌స్టా డీపీ‌లో ఫొటో వైరల్

సూప‌ర్‌-4లో పాకిస్తాన్‌తో మ్యాచులో శ్రేయ‌స్ అయ్య‌ర్ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన రాహుల్ సెంచ‌రీ(111)తో స‌త్తా చాటాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో నే త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌లు అన్నింటికి చెక్ పెట్టాడు. వికెట్ కీప‌ర్‌గానూ మెప్పించాడు. దీంతో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముందు స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. మొద‌టి రెండు మ్యాచుల‌కు రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు విశ్రాంతి ఇవ్వ‌డంతో రాహుల్‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.